చనిపోయిన చెల్లిని బైక్ పై తీసుకెళ్లాల్సిన దుస్థితి.. షాకింగ్ ఘటన..

తోడబుట్టిన వారు చనిపోతే ఆ బాధను భరించడం ఎవరివల్లా కాదు.ముఖ్యంగా తమ కంటే చిన్నవారైనా చెల్లెలు లేదా తమ్ముళ్లు తమ కళ్ళముందే చనిపోతే మనసు ముక్కలవుతుంది ఆ సమయంలో ఎవరూ కూడా వారిని ఓదార్చలేరు.

 Brother Carry The Dead Boby Of Sister On A Bike Shocking Incident , Viral News,-TeluguStop.com

అయితే ఇటీవల ఒక అన్నయ్య( Brother )కు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురయింది అతడు కళ్ళముందే ఆ చెల్లెలు ప్రమాదానికి గురైంది.ఆ ప్రమాదంలో ఆ చెల్లి ప్రాణాలు కోల్పోయింది.

ఒకపక్క చెల్లి చనిపోయిందన్న బాధ మరోపక్క, మృతదేహాన్ని ఇంటికి కూడా చేర్చలేని హాస్పటల్ యాజమాన్యం నిస్సహాయత అతడిని ఎంతో మానసికంగా కృంగదీసాయి.ఎవరికి కన్నీళ్లు వస్తున్నా, గుండెల్లో ఎంతో బాధ ఉన్నా అతడు తన చెల్లి భౌతిక కాయాన్ని బైక్ పై తీసుకెళ్లాడు.

ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రం ఔరయోలోని బిధునా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చోటుచేసుకుంది.

నవంబర్ 8న చోటు చేసుకున్న ఈ ఘటన చాలామందిని కలచివేసింది.ఆ సోదరుడు తన చెల్లిని బండిపై కూర్చోబెడుతూ ఏడుస్తున్న దృశ్యాలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి.వాటర్ వేడి చేసేందుకు హీటర్ ఆన్ చేసిన తర్వాత ఈ సోదరికి కరెంట్ షాక్ తగిలింది.

దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.ఇది గమనించిన సోదరుడు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు కానీ ఫలితం లేకుండా పోయింది.

అప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచుకున్న సిస్టర్( Sister ) చనిపోవడంతో సోదరుడు ఆ బాధను తట్టుకోలేకపోయాడు.అన్నయ్య ఏడుస్తున్న దృశ్యాలను ఒక స్థానికుడు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇది చూసి నెటిజెన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు.ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Man carries sister's dead body to home on bike

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube