ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని బయట వారు ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు.అసలు మన సినిమాలను చూసేవారు కూడా కాదు.
హీరోలు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఎక్కడ హిందీకి తప్ప తెలుగు సినిమాకి ప్రయారిటీ ఇచ్చేవారు కాదు.కానీ రాజమౌళి పుణ్యమా అని ఈ లెక్కలన్నీ మారిపోయాయి.
ఇప్పుడు అందరి దృష్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ వైఫై.హీరోయిన్స్ ఇప్పటికే చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ చేసి మన వారిని పక్కన పెట్టి వారే హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు.
అయితే హీరోయిన్స్ రావడం, పోవడం పెద్ద విషయం ఏమి కాదు కానీ హీరోలు కూడా తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేయడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్.చాలామంది తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ హీరోలు కలలు కంటున్నారు.
షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్( Shah Rukh Khan, Aamir Khan ) లాంటి స్టార్ హీరోలు అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నారు.ఇందులో షారుక్ ఖాన్ కాస్త పరవాలేదు ఇప్పటికే కొన్ని సినిమాలతో ఇక్కడ పాగా వేసి బాగానే మార్కెట్ దక్కించుకున్నాడు.అయితే ఇదే దోవలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సైతం తమ భవిష్యత్ సినిమలతో తెలుగు మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు.వారు చేసే ప్రతి సినిమాను తెలుగులో ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేసుకుంటున్నారు.
ఇక అక్షయ్ కుమార్ సైతం తనకు తెలుగు మార్కెట్ కావాలని బడేమియా చోటేమియా సినిమాతో ఇక్కడ భారీగా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన ఈ సినిమాలో బడేమియా పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.ఇక మరో స్టార్ హీరో అజయ్ దేవగన్( Ajay Devgn ) సైతం తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టారు.గతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒక రోల్ లో నటించి బాగానే గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో మైదాన్ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.
బోని కపూర్ నిర్మాతగా వస్తున్న మైదాన్ సినిమా( Maidaan )కి మామూలుగానే అటెన్షన్ కాస్త దొరికింది.దీని మరింత క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు అజయ్ దేవగన్.