ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ కావడంతో కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఈనెల 17న పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని కథనాలు రావడం జరిగాయి.
దీంతో కర్ణాటక( Karnataka )లో పవన్ కళ్యాణ్ ప్రచారం వార్త అవాస్తవమని జనసేన పార్టీ స్పష్టం చేయడం జరిగింది.ఈనెల 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu )తో కలిసి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన క్లారిటీ ఇచ్చింది.
ఈ పర్యటన ఇప్పటికే ఖరారు అయిందని పేర్కొంది.కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో 17న పవన్ ఎన్నికల ప్రచారం అంటూ వస్తున్నా వార్తలు ఫేక్ అని స్పష్టం చేయడం జరిగింది.ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది.మే 13 వ తారీకు పోలింగ్ జరగనుంది.దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.గత రెండు రోజులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu )తో గోదావరి జిల్లాలలో ప్రచారంలో పాల్గొన్నారు.
ఈసారి ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోవడంతో ఈసారి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు.