సౌత్ లో అవకాశాల కోసం ఎదురు చుస్తున్నానంటున్న మరో బాలీవుడ్ భామ!

మన సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.

 Bollywood Beauty Huma Qureshi Interested In South Movies Details, Huma Qureshi,-TeluguStop.com

మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.

బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇండియన్ మార్కెట్ మీద మన సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంది అనే చెప్పాలి.

పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పలకరించాయి.అలాగే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.

దీంతో అక్కడి స్టార్ హీరోయిన్ లు సైతం మన సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఇది వరకు ఉత్తరాది భామ సౌత్ లో ఏ హీరో సరసన అయినా నటిస్తే ఆమె గొప్ప పని చేసినట్టే అనుకునే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్ లు సౌత్ సినిమాల్లో నటించారు.ఇంకా నటిస్తూనే ఉన్నారు.

కొంతమంది అయితే డైరెక్ట్ గా చెబుతున్నారు.

Telugu Ajith, Bollywood, Huma Qureshi, Kala, Rajnikanth, Vaalimai-Movie

మాకు పలానా సౌత్ స్టార్ అంటే ఇష్టం అని.ఆయనతో నటించాలని ఉంది అని.మరి ఈ లిష్టులోకి మరొక భామ కూడా చేరిపోయింది.బాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు నటిస్తూ.ఇప్పటికి కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న హ్యూమా ఖురేష్ సైతం సౌత్ లో నటించాలని ఉంది అని.అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

మరి వరుస అవకాశాలు అందుకుంటూ కూడా సౌత్ సినిమాల కోసం డైరెక్ట్ గా నటించాలని ఉంది అని చెబుతున్న ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోల సరసన మెప్పించింది.రజనీకాంత్ కాలా, అజిత్ వలిమై సినిమాలలో నటించి మెప్పించి ఇంకా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది.మరి ఈమెకు ముందు ముందు మరిన్ని అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube