తెలుగులో సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన సాగర కన్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో చెప్పినటువంటి బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ బాలీవుడ్లో ఎక్కువగా హీరోయిన్ ఆఫర్లు రావడంతో తెలుగు పరిశ్రమకి దూరమైంది.
అయితే బాలీవుడ్లో మాత్రం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సరసన కొనసాగి దాదాపుగా అందరి బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఈ మధ్యకాలంలో శిల్పాశెట్టి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో ప్రజలకు ఉపయోగపడే పలు ఆరోగ్య సూచనలు, యోగ సలహాలు ఇస్తోంది.అయితే తాజాగా శిల్పా శెట్టి కరోనా వైరస్ గురించి ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియోలో కరోనా వైరస్ గురించి ఎటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని అంతే గాక ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ సేవలను అందిస్తున్నటువంటి వైద్య సిబ్బందికి అండగా ఉంటూ తమ మద్దతు తెలియజేయాలని కోరింది.సమాజం కోసం ప్రమాదాన్ని లెక్కచేయకుండా తమ కోసం శ్రమిస్తున్నటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా సహకరించాలని కూడా కోరింది.
శిల్పా శెట్టి చేసినటువంటి ఈ పనికి పలువురు నెటిజన్లు మరియు సినీ ప్రముఖులు మద్దతు తెలియజేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శిల్పా శెట్టి బాలీవుడ్లో హంగామా – 2 అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని రతన్ జైన్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.అయితే ఇటీవలే శిల్పాశెట్టి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న మరో కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంలో కూడా నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.