బాలీవుడ్( Bollywood ) మన పాన్ ఇండియా సినిమాల తర్వాత నంబర్ 1 స్థానం నుంచి వెనక్కి వెళ్ళిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఇండియాలో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ఇండస్ట్రీ.
అలాగే లాభాలను కూడా చవిచూస్తోంది.వరుసగా బ్లాక్ పాస్టర్స్( Blockbusters ) విజయాలను చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ ఎప్పుడో రెండవ స్థానానికి వెళ్లిపోయింది.
అయితే ఎంతో కొంత బాలీవుడ్ లో కూడా విజయాలు సాధిస్తున్న వారు ఉన్నప్పటికీ అవేమీ అనుకున్న స్థాయిలో హిందీ చిత్ర పరిశ్రమను నిలబెట్టే పరిస్థితి లేదు.ఇప్పుడు ఒక ఇద్దరి గురించి మాత్రం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
వారిద్దరూ మరెవరో కాదు షారుఖ్ ఖాన్ మరియు టబు.
కరోనా లాక్ డౌన్ తర్వాత అనేక సినిమాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడుదల అవుతున్నా కూడా విజయాలను మాత్రం సాధించడం లేదు.అయితే షారుఖాన్ మరియు టబు మాత్రం ఇందుకు భిన్నంగా తమ చిత్రాలను విడుదల చేయడం మాత్రమే కాదు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. షారుక్ ఖాన్( Shah Rukh Khan ) అంటే ఒక వరల్డ్ వైడ్ స్టార్ కానీ నటిగా టబూ కూడా ఈ స్థాయిలో ఉండడం నిజంగా ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం.
షారుఖాన్ లాక్ డౌన్ తర్వాత విడుదల చేసిన సినిమాల విషయానికొస్తే పఠాన్( Pathaan ), జవాన్, డుంకి ఈ లిస్ట్ లో ఉన్నాయి.మంచి కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ కి కాస్త తలవంపులు రాకుండా షారుఖ్ ఖాన్ నిలబెట్టాడు అని చెప్పుకోవచ్చు.
ఇక టబు( Tabu ) నేను కూడా ఏమీ తక్కువ తినలేదు అన్నట్టు మూడు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది.ఈ మూడు సినిమాలు కూడా కరోనా తర్వాతనే రావడం విశేషం.బుల్ బులియా 2, హింది దృశ్యం 2 మరియు తాజాగా విడుదలైన క్రూ ( crew ).ఇలా ఆమె నటిస్తున్న అన్ని చిత్రాలన్నీ కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాలీవుడ్ పరువు పోకుండా కాపాడుతున్నాయి.
వీరిద్దరూ మినహా మరే స్టార్ హీరో సినిమాలు ఆడక పోవడం విశేషం స్టార్ హీరోస్ మాత్రమే కాదు ఈ లిస్ట్ లో ఒక స్టార్ హీరోయిన్ ఉండడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.