అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది.రిపబ్లిన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) జో బైడెన్‌లు( Joe Biden ) అధికారికంగా నామినేషన్ పొందారు.
దీంతో వీరిద్దరి మధ్య మరోసారి పోరు జరగనుంది.ఇదిలావుండగా.
అధ్యక్షుడు బైడెన్ బోర్డర్ పాలసీ పై మండిపడ్డారు ట్రంప్.మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లో( Grand Rapids ) ఆయన పాల్గొన్నారు.
యూఎస్ మెక్సికో సరిహద్దు నుంచి 1000 మైళ్ల దూరంలో వున్న స్వింగ్ కౌంటీలో ట్రంప్ పర్యటించారు.దాదాపు 24 రోజుల విరామం తర్వాత ఆయన ప్రచార పర్వంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
సరిహద్దు భద్రత సమస్యను జాతీయ సమస్యగా ట్రంప్ అభివర్ణించారు.
సరిగ్గా ఇదే సమయంలో అబార్షన్ నిబంధనల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గుంపు నుంచి పెద్దఎత్తున నినాదాలు వినిపించాయి.
వచ్చే వారం ఈ అంశంపై మాట్లాడతానని ట్రంప్ మీడియాకు తెలియజేశారు.ఆరువారాల అబార్షన్ పరిమితిని ధృవీకరించే ఫ్లోరిడా స్టేట్ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత డెమొక్రాట్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో ట్రంప్ పర్యటన జరిగింది.
అబార్షన్, ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్, బైడెన్‌ల వైఖరిలో వైరుధ్యాలు వున్నాయి.

మిచిగాన్‌లోని రిపబ్లికన్ వ్యూహకర్త జాన్ యోబ్( John Yob ) మాట్లాడుతూ.ఇవాళ సాధారణ ఎన్నికల ప్రారంభోత్సవమన్నారు.మిచిగాన్‌లోని( Michigan ) గ్రాండ్ రాపిడ్స్.
జాతీయ ఎన్నికల్లో గ్రౌండ్ జీరో.ఎందుకంటే ట్రంప్ 2016, 2020ల నాటి సంఖ్యలకు సంబంధించి వెస్ట్ మిచిగాన్‌లో అధిక పనితీరును ప్రదర్శించగలిగితే అది మిచిగాన్‌ను బైడెన్‌కు దూరం చేస్తుంది.
ఇంతటి ప్రాధాన్యం వుండటం వల్లే ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ పాలసీ వ్యాఖ్యలకు గ్రాండ్ ర్యాపిడ్‌ను వేదికగా ఎంచుకున్నారు.గ్రాండ్ ర్యాపిడ్స్ అనేది కెంట్ కౌంటీకి కేంద్రం.

ఇకపోతే.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగత సమస్యలు వెంటాడుతున్నాయి.న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసులో తాజాగా కోర్టులో 175 బిలియన్ డాలర్ల బాండ్ సమర్పించారు.దీని వల్ల న్యాయస్థానం తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా చూసుకోగలిగారు.
అంతేకాదు.తన ఆస్తులను జప్తు చేసే అవకాశం కూడా లేకుండా వ్యవహరించగలిగారు.







