నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి.. ఆదిపురుష్ ట్రోల్స్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్.రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

 Bollywood Actor Bijay Anand Sensational Comments On Adipurush Movie Trolls, Boll-TeluguStop.com

ప్రభాస్, కృతిసనన్ సీతా రాముళ్లుగా తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్.అయితే ఈ సినిమాపై రిలీజ్ ముందు నుంచి విమర్శలు వచ్చాయి.

రిలీజ్ అయ్యాక అసలు అది రామాయణం కాదని, రామాయణాన్ని ఇష్టమొచ్చినట్టు మార్చేసాడని, 600 కోట్లు ఖర్చుపెట్టి కనీసం గ్రాఫిక్స్ కూడా సరిగ్గా చేయలేదని ఓం రౌత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి.

Telugu Adi Purush, Bijay, Bollywood, Bollywoodbijay, Sensational-Movie

ఇప్పటికే ఆదిపురుష్( Adipurush ) సినిమాపై, ఓం రౌత్ పై వచ్చిన ట్రోల్స్ కి పలువురు పలు రకాలుగా స్పందించారు.తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బిజయ్ ఆనంద్( Bijay Anand ) ఆదిపురుష్ లో బ్రహ్మ పాత్రలో కనిపించారు.

తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించారు.ఈ సందర్భంగా బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ.

కళని విమర్శించడం మంచి పద్ధతి కాదు.సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ విమర్శించడానికి మీరు ఎవరు? ఒక కళాకారుడు తనకు నచ్చినట్టు కళని రూపొందిస్తాడు.

Telugu Adi Purush, Bijay, Bollywood, Bollywoodbijay, Sensational-Movie

దాని కోసం డబ్బు, సమయం, తన కష్టం అంతా పెడతాడు.600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ సినిమా తీసాడంటే అది అతని ఇష్టం.మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి.అంతేకాని అతన్ని విమర్శించడానికి మీరెవరు.కల మంచిదా, చెడ్డదా అని మీరు చెప్తే అయిపోదు.కొంతమంది కళాకారులను భయపెడుతున్నారు.

ఓం రౌత్ ని అలాగే భయపెట్టారు.కానీ ఓం రౌత్ భయపడకుండా, ట్రోల్స్ ని పట్టించుకోకుండా ఉన్నాడు.

అందుకే అతను నాకు ఇష్టం అని అన్నాడు.దీంతో బిజయ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube