కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యం.. మరోసారి నిజ్జర్ హత్యను లేవనెత్తిన జస్టిన్ ట్రూడో

ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య విషయాన్ని మరోసారి కదిపారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.( Canada PM Justin Trudeau ) కెనడియన్లందరి హక్కులు, స్వేచ్ఛలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు.

 Canadian Pm Justin Trudeau Rakes Up Hardeep Singh Nijjar Killing At Hearing On P-TeluguStop.com

బుధవారం కెనడా ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న ఉన్నత స్థాయి బహిరంగ విచారణలో సాక్ష్యం ఇచ్చారు ట్రూడో.తమకు ముందున్న ప్రభుత్వం.

న్యూఢిల్లీతో హాయిగా వుందని ఆరోపించారు.స్థానిక మీడియా షేర్ చేస్తున్న లైవ్ స్ట్రీమింగ్ వీడియోల ప్రకారం.2019, 2021 ఎన్నికల సమయంలో విదేశీ జోక్యంపై( Foreign Interference ) నిఘా సమాచారం అందిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించగా ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన వాంగ్మూలంలో నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ పాత్ర గురించి కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారరు.అతను ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను స్వీకరించిన విధానం, దానిపై అతను ఎలా వ్యవహరించాడు, అలాగే చైనా ప్రభావానికి సంబంధించి ఇన్‌పుట్‌ల గురించి ఏం జరిగిందనే దానిపై మాట్లాడారు.2019 ఎన్నికలు ముగిసిన 3 నెలల తర్వాత ఇంటెలిజెన్స్ నివేదిక గురించి మాట్లాడుతూ.ట్రూడో ఇలా అన్నారు.ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కెనడాకు( Canada ) వచ్చిన ఎవరైనా ఏదైనా దేశం నుంచి దోపిడీ, బలవంతం, జోక్యం లేకుండా వుండటానికి కెనడాలోని అన్ని హక్కులను కలిగి వుంటారు.

నిజ్జర్‌ను చంపడంపై తాను పార్లమెంట్‌ ముందుకు తెచ్చిన చాలా తీవ్రమైన కేసు సహా కెనడియన్ల కోసం తాము నిలబడ్డామని జస్టిన్ ట్రూడో గుర్తుచేశారు.

Telugu Canadianpm, China, Hardeepsingh, India, India Canada, Justin Trudeau, Kha

కాగా.తన ఎన్నికల్లో భారత్,( India ) పాకిస్తాన్‌లు( Pakistan ) జోక్యం చేసుకున్నాయని కెనడా కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు కెనడా గూఢచార సంస్థ 2019, 2021 సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత్, పాకిస్తాన్‌ల రహస్య కార్యకలాపాలను ఆరోపిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది.

దీనిపై భారత్ భగ్గుమంది.ఈ దర్యాప్తును నిరాధారమైనదిగా పేర్కొన్న న్యూఢిల్లీ తమ అంతర్గత వ్యవహారాల్లో కెనడాయే జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.

Telugu Canadianpm, China, Hardeepsingh, India, India Canada, Justin Trudeau, Kha

2021లో ఖలిస్తాన్( Khalistan ) ఉద్యమం, పాకిస్తాన్ అనుకూల వైఖరికి మద్ధతుగా నిలిచే భారత సంతతి ఓటర్లు ఎక్కువగా వున్న నిర్దిష్ట ఎన్నికల జిల్లాలను భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) ఆరోపించింది.అభ్యర్ధులకు అక్రమ ఆర్ధిక మద్ధతు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలను తిప్పికొట్టడానికి ప్రయత్నించి వుండొచ్చని పేర్కొంది.అదే విధంగా 2019లో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు కెనడా రాజకీయ దృశ్యంలో.ఆ దేశ ప్రయోజనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రహస్య కార్యకలాపాలలో నిమగ్నమై వున్నారని సీఎస్ఐఎస్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube