ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే పొత్తులపై అభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ఏపీకి బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్( Tarun Chugh ) రానున్నారు.బీజేపీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
సంక్రాంతి కల్లా పొత్తులపై బీజేపీ( BJP ) నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తుంది.