ఏదైనా టాలెంట్ ఉంటే చాలు.సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిపోతున్నారు.
చాలా మంది ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్లుగా మారిపోయారు.ఇదే తరహాలో బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో నివసిస్తున్న సింగర్ అమర్‌జిత్ జైకర్ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు.
బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సాంగ్ పాడిన పాటలను పాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అతడి గాత్రానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అతడిలో చాలా ట్యాలెంట్ ఉందని ప్రశంసిస్తున్నారు.ఇటీవలే దిల్ దే దియా హై అనే పాటతో సోషల్ మీడియా సెలబ్రెటీగా మారిపోయాడు.
ప్రస్తుతం మరో పాట పాడి దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతంలో నివసించే 21 ఏళ్ల అమర్‌జిత్‌కు పాటలు పాడడం చాలా ఇష్టం.తనకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన తన గర్ల్ ఫ్రెండ్ తనను బాగా ప్రోత్సహిస్తోందని చెప్పాడు.ఆమె గిటార్ గిఫ్ట్ ఇచ్చిందని, దానితో పాటలు పాడుతూ గిటార్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా అమర్‌జిత్ మేరే యారా సాంగ్ పాడాడు.దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దీనికి ఇప్పటికే 24 వేల వ్యూస్ దక్కాయి.
అతడి గాత్రం చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
అమర్‌జిత్ ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అంతేకాకుండా అప్పుడప్పుడు అమర్‌జిత్ స్టేజ్ షోలు చేస్తుంటాడు.తాను భవిష్యత్తులో పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
ఇక గతంలో అమర్‌జిత్ పాడిన పాటలు వైరల్ అయ్యాయి.ఈ వీడియోలు చూసిన నటుడు సోనూ సూద్ అతడిని ప్రశంసించారు.
అంతేకాకుండా అమర్‌జిత్‌కు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు.సోనుసూద్ తన తర్వాతి సినిమా ఫతేలో ఓ పాట పాడేందుకు అమర్‌జిత్‌కి ఛాన్స్ అందించాడు.
ఆ పాట కోసం అమర్జీత్ సోమవారం ముంబై వెళ్లాడు.అతడు మంచి సింగర్ అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.