తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss )సీజన్ సెవెన్ కార్యక్రమం ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.
ఇక ఈ సీజన్లో ఎప్పటిలాగే పలువురు సెలబ్రిటీలతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లారు.ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సాధారణ రైతు పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
వ్యవసాయ పనులు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ఎంతో ఫేమస్ అయ్యారు.
ఈ విధంగా పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.అయితే ఈయనకు ఎప్పటినుంచో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరికగా ఉంది అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలుసార్లు తెలియజేయడంతో నిర్వాహకులు ఈయనకు ఈసారి అవకాశం కల్పించారు.ఇలా బిగ్ బాస్ అవకాశం తనకు రావడంతో ఈయన ఎమోషనల్ అవుతూ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇంస్టాగ్రామ్ ద్వారా పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ నా స్వప్నం సాకారమైన వేళ.ఆశయం నెరవేరిన వేళ.ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని నాగార్జున( Nagarjuna )గారితో మాట్లాడాలని ఆయనని తాకాలని ఎదురుచూస్తున్నటువంటి నా కల ఇన్నాళ్లకు ఫలించింది.వేదికపై నాగార్జున గారిని కలిసిన ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది ఇలా నా కల సహకారం అయింది అంటే అందుకు మీ అభిమానమే కారణం.
ఇలా నన్ను ఆదరించిన మీ అందరికీ పాదాభివందనాలు జై జవాన్ జై కిసాన్( Jai Jawan Jai Kisan ) అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.