అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లు కీలక పదవుల్లో వున్న సంగతి తెలిసిందే.ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే వుంది.
తాజాగా భారత సంతతికి చెందిన మహిళా శాస్త్రవేత్తను కీలక పదవిలో నియమించారు బైడెన్.నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్ కమిటీలో ఇండో అమెరికన్ పరిశోధకురాలు, కంప్యూటర్ శాస్త్రవేత్త పద్మా రాఘవన్‌ను సభ్యురాలిగా నియమించారు.
ఈ మేరకు వైట్‌హౌస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.భౌతిక, జీవ, గణిత, ఇంజనీరింగ్, సామాజిక, బిహేవియర్ సైన్స్‌లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించడానికి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్.
ప్రెసిడెంట్ అవార్డు కోసం నామినీలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.స్థాపించబడిన నాటి నుంచి నేటి వరకు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌ను 506 మంది విశిష్ట శాస్త్రవేత్తలు, ఇంజనీర్‌లకు బహుకరించారు.
వైట్‌హౌస్ ప్రొఫైల్ ప్రకారం.వాండర్ బిల్ట్ యూనివర్సిటీలో రీసెర్చ్‌కి పద్మా రాఘవన్ ప్రారంభ వైస్ ప్రావోస్ట్, అలాగే కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్.2016లో వాండర్‌బిల్ట్‌లో చేరడానికి ముందు ఆమె రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ ఇనిషియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.ఎనర్జీ ఎఫిషియెంట్ సూపర్ కంప్యూటింగ్ అభివృద్ధికి చేసిన కృషికి గాను 2013లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఫెలోగా పద్మా రాఘవన్ ఎంపికయ్యారు.
అలాగే సొసైటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డైరెక్టరేట్ అడ్వైజరీ బోర్డు, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అడ్వాన్స్‌డ్ సైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎడిటోరియల్ బోర్డులలో కూడా పద్మా రాఘవన్ పని చేశారు.
ఇకపోతే.పద్మా రాఘవన్‌తో పాటు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ కమిటీకి మరో 10 మంది సభ్యులను కూడా నామినేట్ చేయాలని జో బైడెన్ భావిస్తున్నారు.వారు: మే బెరెన్‌బామ్, రాఫెల్ బ్రాస్, జోన్ ఫెర్రిని-ముండీ, ఎరికా గొంజాలెజ్, జువాన్ మాల్డసెనా, కోరా బాగ్లీ మారెట్, వాలెరీ మోంట్‌గోమెరీ రైస్, క్రెయిగ్ పార్ట్రిడ్జ్, పెడ్రో ఎ.శాంచెజ్, రాబర్ట్ సెల్లెర్స్ , చెరీస్ విన్‌స్టెడ్.