ప్రమాదానికి కొన్ని గంటల ముందు అక్కడ ఆగి వెళ్లిన హరికృష్ణ.! అక్కడ ఎందుకు ఆగారు అంటే.?  

Before Death Hari Krishna Spend Time In Lb Nagar Chintalkunta-

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు.నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు..

Before Death Hari Krishna Spend Time In Lb Nagar Chintalkunta--Before Death Hari Krishna Spend Time In LB Nagar Chintalkunta-

ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా.ప్రమాదానికి కొన్ని గంటల ముందు హరికృష్ణ అక్కడ ఆగి వెళ్ళారంట.

హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నెల్లూరుకు బయలుదేరి వెళ్తున్న క్రమంలో చింతల్‌కుంటలో 5 నిమిషాల పాటు ఆగారు.ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు వెంకట్రావును కూడా కారులో ఎక్కించుకొని వెళ్లేందుకు.స్థానికంగా ఉన్న దుర్గా విలాస్‌ హోటల్‌ ముందు ఆగారు..

పశువుల సంత వ్యాపారులు సత్తిబాబు, సాంబశివరావు అతని కారు వద్దకు వెళ్లి మాట్లాడారు.కారు డ్రైవింగ్‌ సీటులో హరికృష్ణ ఉండగా, పక్క సీటులో శివాజీ ఉన్నాడని వారు పేర్కొన్నారు.తమతో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారని, అంతా బాగానే ఉందని సమాధానమిచ్చామని వారు తెలిపారు.

అంతేకాదు హరికృష్ణ ముప్పై ఏళ్లుగా ఎల్.బి నగర్ చింతలకుంట వద్ద పశువుల సంతకు నిత్యం వచ్చి వెళ్తుండేవారు అంట .చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు చెందిన పశువుల పాకలో గంటల తరబడి కాలక్షేపం చేసేవారు.

వారానికి నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చే వారని స్థానికులు పేర్కొన్నారు.రాజమండ్రిలో రూ.4లక్షలకు కపిలి ఆవును కొనుగోలు చేసి ఇక్కడ సుమారు 4 ఏళ్ల పాటు పెంచి తర్వాత గన్నవరంలోని తన స్నేహితుడు పూర్ణచందర్‌రావుకు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.హరికృష్ణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత చింతల్‌కుంటకు రావటం తగ్గించారని వారు పేర్కొంటున్నారు.

తమది 40 ఏళ్ల స్నేహమని నాగేశ్వరరావు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే నిత్యం తనను కలిసేందుకు చింతల్‌కుంట పశువుల సంతకు వచ్చేవారని తెలిపారు.