బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు.ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
విచారణకు హాజరుకావాలన్న ఆదేశాల మేరకు ఇవాళ కమిషన్ ముందుకు వెళ్లనున్నారు.అయితే బండి సంజయ్ తన కామెంట్స్ పై ఏం వివరణ ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.