ప్రస్తుతం నందమయూరి బాలకృష్ణ( Balakrishna ) జోరు ముందు యంగ్ హీరోలు కూడా పనికిరావడం లేదు.ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రాలు ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి‘ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలుగా నిలిచాయి.ఈ రెండు సినిమాలు బాలయ్య బాబు మార్కెట్ ని మార్చేసింది.‘అఖండ’ కి ముందు బాలయ్య మార్కెట్ 30 కోట్ల రూపాయిలు వరకు ఉండేది.కానీ అఖండ తర్వాత ఆయన మొదటి రోజు వసూళ్లే 30 కోట్ల రేంజ్ లో వస్తున్నాయి.ఈ స్థాయి ఎదుగుదల రీసెంట్ టైం లో ఏ హీరో కి కూడా చూడలేదు.‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ టాక్ షో కూడా బాలయ్య బాబు కి బాగా కలిసొచ్చింది.ఈ టాక్ షో తర్వాత ఆయన యూత్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకర్షించాడు.
ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి తో ‘భగవత్ కేసరి( Bhagath Kesari )’ అనే చిత్రం చేస్తున్నాడు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీలీల ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తుంది.బాలయ్య బాబు కి కూతురుగా ఆమె నటించబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమా తర్వాత బాలయ్య ఏ సినిమా చెయ్యబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో అనేక వార్తలు వినిపించాయి.బోయపాటి శ్రీను తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని ప్రచారం సాగింది.
బోయపాటి తో నిజంగానే ఒక సినిమా ఖరారు అయ్యింది.కానీ అది ఈ చిత్రం తర్వాత ఉండదట, బాలయ్య బాబు ద్రుష్టి మొత్తం ఇప్పుడు పాన్ వరల్డ్ స్కేల్ లో తెరకెక్కబోతున్న సినిమా పైనే ఉందట.
అసలు విషయానికి వస్తే ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు తనకి ‘చెంగిస్ ఖాన్’ బయోపిక్( Genghis Khan ) లో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆయన ఆ మాట చెప్పినప్పటి నుండి చెంగిస్ ఖాన్ కి సంబంధించిన విషయాలన్నీ పరిశోధించి, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్, ఈయన గతం లో బాలయ్య బాబు తో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి( Samarasimha Reddy ) మరియు నరసింహ నాయుడు వంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నా బి గోపాల్,బాలయ్య తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడట.ఇటీవలే బాలయ్య బాబు ని కలిసి ఫైనల్ న్యటేషన్ ఇచ్చాడట గోపాల్, బాలయ్య కి అది ఎంతో బాగా నచ్చిందట.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంబించుకో డేట్స్ ఇచ్చేస్తాను అన్నాడట.ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ వెయ్యి కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టి నిర్మించడానికి సిద్ధం గా ఉన్నాడట.