కేజీఎఫ్2 సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసిన బేబీ.. చిన్న సినిమాల్లో పెద్ద విజయమంటూ?

చిన్న సినిమాలు పెద్ద విజయం సాధిస్తే ఆ సినిమాల ద్వారా నిర్మాతలకు వచ్చే లాభాలు సైతం వేరే లెవెల్ లో ఉంటాయి.పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే సరికొత్త రికార్డులు సొంతమవుతున్న తరుణంలో బేబీ సినిమా( Baby Movie ) మాత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

 Baby Movie Breaks Kgf2 Movie Record Details Here Goes Viral In Social Media,bro,-TeluguStop.com

ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతుంది.కథలో కొత్తదనం ఉండటం, సినిమాలో నటులు కాకుండా పాత్రలే కనిపించడం, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండటం బేబీ సక్సెస్ కు కారణమైంది.

Telugu Baby, Kgf-Movie

ఇప్పటికే పలు రికార్డ్ లను బ్రేక్ చేసిన బేబీ మూవీ తాజాగా కేజీఎఫ్2 మూవీ( KGF 2 ) సాధించిన రికార్డులను సైతం బ్రేక్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.కేజీఎఫ్2 సినిమా 12 రోజుల పాటు వరుసగా కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోగా బేబీ మాత్రం 13 రోజుల పాటు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాలలో కేజీఎఫ్2 సినిమాకు ఉన్న రికార్డ్ ను ఈ 10 కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ బ్రేక్ చేసింది.
బేబీ సినిమాను క్లాసిక్ అని చెప్పలేం కానీ ఈ సినిమా సక్సెస్ బాక్సాఫీస్ కు ఊపిరి పోయడంతో పాటు మరిన్ని చిన్న సినిమాల నిర్మాణం దిశగా అడుగులు పడటానికి కారణమైంది.

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య( Anand Deverakonda, Vaishnavi Chaitanya )ల క్రేజ్, పారితోషికంను ఈ సినిమా పెంచేసింది.ఆర్ఆర్ఆర్ మూవీ 17 రోజుల పాటు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Telugu Baby, Kgf-Movie

అయితే పవన్ బ్రో మూవీ( Bro Movie ) రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బేబీ మూవీ హవా తగ్గే ఛాన్స్ అయితే ఉంది.బ్రో సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా బేబీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగించే ఛాన్స్ అయితే లేదు.యూత్ కు విపరీతంగా నచ్చడం వల్లే బేబీ మూవీ సక్సెస్ సాధించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube