ఆ చ‌ర్య‌ల వ‌ల్లే ప‌వ‌న్ రాజ‌కీయాల్లో వీక్ అయిపోతున్నారా..

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లో ఆయ‌న మీద అటు ప్ర‌జ‌ల్లో, ఇటు పార్టీల్లో భారీగా అంచ‌నాలు ఉండేవి.ఆయ‌న ట్రెండ్ సెట్ట‌ర్ అవుతార‌ని అంతా భావించారు.

 Are You Becoming A Week In Pawan Politics Because Of Those Actions . Pawan, Ap P-TeluguStop.com

కానీ ప‌రిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.ఆయ‌న కూడా గెల‌వ‌క‌పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిపోయింది.

అయినా స‌రే జ‌న‌సైనికులు మాత్రం ప‌వ‌న్‌ను విడిచి వెళ్ల‌లేదు.క‌మిట్ మెంట్ తో ప‌నిచేస్తున్నారు.

ఇది పార్టీకి క‌లిసి వ‌చ్చే అంశం.కానీ ప‌వ‌న్ మాత్రం ఇలా పార్టీ కోసం ప‌నిచేస్తున్న నాయ‌కుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

నిజానికి ఇలా పార్టీ కోసం బ‌లంగా ప‌నిచేసే నాయ‌కుల‌కు అండ‌గా ఉంటే వారు మ‌రింత గ‌ట్టిగా పోరాడుతారు.అది అంతిమంగా పార్టీకి క‌లిసి వ‌స్తుంది.కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ‌ను ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.పైగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారికి ఎలాంటి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌కుండా తాత్సారం చేయ‌డం పెద్ద మైన‌స్ గా మారిపోయింది.

వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ స‌పోర్టు ఇవ్వ‌కున్నా చాలామంది పోటీ చేసి గెలిచారు కూడా.నిజానికి ప‌వ‌న్ స్వ‌యంగా రంగంలోకి దిగి వారి గెలుపుకోసం ప్ర‌య‌త్నిస్తే మ‌రింత మంది గెలిచేవారు.

Telugu Ap, Bjp, Chandra Babu, Janseena, Pawan, Tdp, Ys Jagan, Ysrcp-Telugu Polit

అలా చేయ‌కుండా పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారితో ట‌చ్ లో లేక‌పోవ‌డం ప‌వ‌న్‌కు న‌ష్టంగా మారింది.గ్రౌండ్ లెవ‌ల్ లో పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారు ఇప్ప‌టికే అనేక సూచ‌న‌లు ప‌వ‌న్ కు చేశారంట‌.పార్టీని బ‌లోపేతం చేసేందుకు తాము చేస్తామ‌న్న ప‌నుల‌ను ప‌వ‌న్ వ‌ద్ద‌ని చెప్ప‌డంతోనే వారు సైలెంట్ అయిపోతున్నారంట‌.ఇందుకు కార‌ణం ఏంటంటే ప‌వ‌న్ ఎవ‌రినీ పెద్ద‌గా న‌మ్మ‌క‌పోవ‌డం.త‌న‌ను తాను త‌ప్ప ఇంకెవ‌రినీ న‌మ్మి పార్టీ ప‌ర‌వ‌మైన కార్య‌క్ర‌మాలు చేయించ‌ట్లేదు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.దీంతో ఆయ‌న పార్టీలోనూ బ‌ల‌హీనంగా మారిపోతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube