తెలంగాణలో జనసేనకు ట్రబుల్స్ తప్పవా ? రోడ్డెక్కుతున్న బీజేపీ నేతలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ట్రబుల్స్ తప్పేలా కనిపించడం లేదు.ఇప్పటికే బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి.

 Are There Any Problems For Janasena In Telangana? Bjp Leaders On The Road ,-TeluguStop.com

అంతకంటే ముందుగా జనసేన , తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ,32 స్థానాల్లో అభ్యర్థులను పోటికి దించుతామని పవన్ ప్రకటించారు .ఆ తర్వాత బిజెపి అగ్రనేతలు చేయడంతో వెనక్కి తగ్గి బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు.పొత్తులో భాగంగా కొన్ని కీలక స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు బిజెపి అగ్ర నేతలు అంగీకారం తెలిపారు.ఇంకా పొత్తుల వ్యవహారం పూర్తిస్థాయిలో తేలలేదు.అయితే జనసేనతో పొత్తు,  సీట్ల కేటాయింపు వ్యవహారం బిజెపి కి ఇబ్బందికరంగా మారింది.పొత్తులో భాగంగా తమ స్థానాలను జనసేనకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని బిజెపి అభ్యర్థులు చెబుతున్నారు.

అసలు జనసేనతో బిజెపి( BJP Jana Sena ) పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని,  ఆ పార్టీ తో పొత్తు వద్దే వద్దు అని బిజెపి నేతలు కొత్త రాగం అందుకున్నారు.

Telugu Congress, Janasena, Pavan Kalyan, Serilingampally, Telangana Bjp, Telanga

 పొత్తులో భాగంగా జనసేనకు ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారని నిలదీస్తున్నారు.ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజులుగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన బిజెపి నేతలు చేపట్టారు.ముఖ్యంగా కూకట్ పల్లి ,  శేరిలింగంపల్లి జనసేనకు కేటాయించేందుకు బిజెపి అధిష్టానం నిర్ణయించుకోవడంతో,  ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళనకు దిగారు.

ఈరోజు కూకట్ పల్లి బిజెపి కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కూకట్ పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Telugu Congress, Janasena, Pavan Kalyan, Serilingampally, Telangana Bjp, Telanga

ఇక నిన్న కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. శేరిలింగంపల్లి సీటు జనసేనకు కేటాయించ వద్దంటూ బిజెపి నేతలు ( BJP ) ఆందోళన చేపట్టారు.శేరిలింగంపల్లి టిక్కెట్ ను జనసేనకు కేటాయించడంపై మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి( konda visweswarareddy ) అభ్యంతరం మొత్తం చేస్తున్నారు.  శేరిలింగంపల్లి టికెట్ రవికుమార్ యాదవ్ కు ఇవ్వాల్సిందేనని కొండ విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ వినిపిస్తున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ ( Ravi Kumar Yadav )ఇవ్వాల్సిందేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టు పడుతున్నారు .అయితే ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని పవన్ నిర్ణయించుకున్నారు.  కూకట్ పల్లి సీటు జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను విరమించుకోవాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు .ఈ క్రమంలో జనసేన బీజేపీ పొత్తు ఆదిలోనే హంసపాధాన్నట్లుగా తయారైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube