అనుష్క బర్త్ డే స్పెషల్..! స్వీటీ గురించి చాలామందికి తెలియని 16 ఆసక్తికర విషయాలివే..! పూరి ఫోటో అడిగితే.?  

‘ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. ‘భాగమతి’ అడ్డా.. అంటూ ..భాగమతిగా అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది.తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా అనుష్కే..ఒక అరుందతి,ఒక రుద్రమదేవి,ఒక సైజ్ జీరో అనుష్క ఏది చేసినా ఢిఫరెంటే..ఇప్పుడు భాగమతి…అసలు అనుష్క సినిమా కెరీర్ ఎలా ప్రారంభమయింది…ఇక్కడివరకూ ఎలా వచ్చింది..ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు..

1. అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారింది..బేసిగ్గా అనుష్క చాలా సిగ్గరి.సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తాననే ఎప్పుడు అనుకోలేదట.నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka

2. సినిమాల్లో కనపడే అనుష్క బైట ఆడియో ఫంక్షన్స్ ఇతర ఫంక్షన్స్ లో కనపడే అనుష్కకి చాలా తేడా ఉంటుంది.ముఖ్యంగా దుస్తుల విషయంలో..కేవలం పాత్ర ప్రాధాన్యతను బట్టి దుస్తులు ధరించే అనుష్క బైట మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంది.స్కర్ట్స్,వెస్ట్రన్ వేర్ ని ఇష్టపడని అనుష్క ఎక్కువగా చీరలు,చుడీదార్స్ లోనే దర్శనమిస్తుంది.బంగారాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడదు.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

3. ఫస్ట్ టైం పూరిజగన్నాద్ ఏదన్నా ఫోటో ఇవ్వమని అడిగితే పర్స్ లో నుండి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట.. దానికి పూరి పెద్దగా నవ్వి ..సూపర్ ఆడిషన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తే..ఫోటోకి ఎలా పోజ్ ఇవ్వాలో తెలియని అనుష్కకి నాగార్జునే నేర్పించారట..అప్పటి నుండి ఇప్పటివరకు అనుష్క వెనుదిరిగి చూసింది లేదు.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

4. సినిమాల్లో ఎంతో ధైర్యశాలిగా కనపడే అనుష్కకి ఎత్తైన ప్రదేశాలంటే భయం.బిల్లా సినిమాలో ఎత్తునుండి దూకాల్సిన స్టంట్ చేసేప్పుడు భయపడ్డమే కాదు..చేశాక ఒకటే ఏడుపట..ఇంటికెళ్లాక కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ఏడ్చిందట అనుష్క.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

5. సరోజ క్యారెక్టర్ ని నెరేట్ చేయడానికి వెళ్లిన క్రిష్ చెప్పడానికి సంశయించారట.కానీ అనుష్కే చొరవ తీసుకుని చెప్పండి పర్లేదు అంటే..నెరేట్ చేసాడట క్రిష్..వెంటనే యాక్సెప్ట్ చేసిందట అనుష్క..ఆ తర్వాత ఆ క్యారెక్టర్ అనుష్క కి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో చెప్పక్కర్లేదు కదా.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

6. ఇప్పటివరకూ మూడు సార్లు ద్విపాత్రాభినయం చేసింది అనుష్క. .ఆ మూడు సినిమాలు అరుందతి,పంచాక్షరి,వర్ణ..

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

7. రాజమౌలితో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా అనుష్కనే ఒకటి విక్రమార్కుడు,రెండు బాహుబలి

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

8. ఇప్పటివరకూ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,రెండు నంది అవార్డులు ,మూడు సినెమా అవార్డులు అందుకుంది అనుష్క.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

9. ఫోన్ తక్కువగా వాడుతుందట..న్యూస్ కి ,సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

10. టాలివుడ్లో అధిక పారితోషికం తీసుకునే నటి అనుష్కే.అరుందతి సినిమా ముందు వరకూ కూడా గ్లామర్ రోల్స్ పోషించింన అనుష్క అరుందతి పాత్ర చేయడానికి భయపడితే ,దర్శకుడు కోడీ రామకృష్ణ,నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం నువ్ మాత్రమే చేయగలవ్ అని నమ్మేవారట.ఆ తర్వాత ఒక్కో సీన్ కి రీటేక్ లు తీసుకుంటూ సీన్ ఫర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు కష్టపడేదట..తనతో పాటు సినిమా టీం కూడా…13కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా 34కోట్లు వసూలు చేసింది.ఇప్పటికీ టాప్ 4 సినిమాల్లో అరుందతి ఉంటుంది.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

11. భాగమతి స్క్రిప్ట్ ఎప్పుడో విన్నప్పటికీ ఐదేండ్ల తర్వాత డేట్స్ ఇచ్చిందట అనుష్క..అన్నేండ్ల తర్వాత సినిమా సెట్స్ మీదికెల్లేముందు ఏ క్వశ్చన్ అడగకుండానే యాక్సెప్ట్ చేసిందట..

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

12. నటజీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట.ప్రయాణాలంటే కూడా అనుష్కకి ఇష్టం.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

13. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది.ఫ్రెంచ్ మూవీస్ లో నటించాలనేది అనుష్క కోరిక..డిఫరెంట్ స్టోరీ,తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే హిందీ,ఫ్రెంచి భాషల్లో నటిస్తుందట.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

14. అనుష్క అంటే చాలా మంచి నటి అని మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ తనకొచ్చే ప్రతి పాత్రనుండి నటనను నేర్చుకునే దశలోనే ఉన్నానంటుంది.

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

15. రుద్రమదేవి సినిమాలో హార్స్ రైడింగ్ సన్నివేశంలో నటించేప్పుడు కూడా అనుష్క చాలా భయపడిందట..

Anushka Shetty Birthday Special 16 Unknown Facts About Anushka-

16. సూపర్ నుండి బాగమతి వరకూ ఏన్నో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది అనుష్క .దేవసేన, రుద్రమదేవి, భాగమతి ,అరుందతి ఈ పేర్లు వింటే చాలు ప్రేక్షకుల కళ్లముందు అనుష్కే కనపడుతుందంటే తన నటనతో ఎంతగా మెప్పించిందో అర్దం చేసుకోవచ్చు.