విస్కీని పట్టుకొని సంతోషంగా ఉద్వేగానికి గురైన అనుపమ

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అఆ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.తరువాత శతమానం భవతి సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్ గా నటించి సక్సెస్ అందుకుంది.

 Anupama Emotional Post On Her Pet Dog Vicky, Tollywood, 18 Pages Movie, Karthike-TeluguStop.com

ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలని ఈ అమ్మడు అందుకుంది.గ్లామర్ స్కిన్ షో చేయకున్న తన స్మైల్, హాట్ లుక్స్ తో కుర్రకారు మనసులని దోచిన అనుపమకి టాలీవుడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయినా కూడా వరుస ఫ్లాప్ ల కారణంగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో అవకాశాన్ని పోగొట్టుకోవడం కూడా ఈ భామకి మైనస్ అయ్యిందని చెప్పాలి.

అయితే తెలుగు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన మాతృభాష మలయాళంలో కొన్ని సినిమాలని అనుపమ పూర్తి చేసింది.అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ కి జోడీగా 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.ఈ రెండు సినిమాల మీద మంచి హైప్ ఉంది.

వీటి తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతాననే నమ్మకంతో అనుపమ ఉంది.

ఇదిలా ఉంటే అనుపమ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటూ ఇంటరెస్టింగ్ పోస్టులని పెడుతూ ఉంటుంది.

అలాగే తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది.తాజాగా తన విస్కీకు నాలుగేళ్లు పూర్తయ్యాయంటూ అనుపమ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.అయితే ఇక్కడ విస్కీ అంటూ ఏదో మందు బ్రాండ్‌ కాదు.అనుపమ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు.

పెట్స్‌పై ఎంతో పప్రేమ కురిపించే అనుపమ తన విస్కీ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసింది.దీనికి సంబంధించిన కుక్కతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది.

గతేడాది చాలా కష్టంగా సాగింది.విస్కీ సోదరుడు ట‌డ్డీ, ర‌మ్‌ల‌ను కోల్పోయి ఎంతో బాధపడుతున్న మా జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన విస్కీకి కృతఙ్ఞతలు అంటూ కుక్కపిల్లపై ఎంతో ప్రేమ కురిపిస్తూ అనుపమ పోస్ట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube