ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!

ఐపీఎల్ 2022 మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఏప్రిల్ 21న ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ ధోనీ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది.

 Another Rare Record In Dhoni's Account For The First Time In Pl History! Ipl, Ra-TeluguStop.com

ఎందుకంటే ఈ మ్యాచ్‌ని గెలిపించడంతోపాటు ధోనీ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా మిస్టర్ కూల్ తన పేరున ఒక రికార్డు లిఖించుకున్నాడు.

రికార్డుల్లో నిలిచాడు.ముంబై ఇండియ‌న్స్‌ తో జరిగిన రీసెంట్ మ్యాచ్‌లో జయదేవ్‌ ఉనద్కట్‌ బౌలింగ్‌లో రికార్డు ధోనీ క్రియేట్ చేశాడు.

ఐపీఎల్ లో మొత్తంగా ధోనీ ఉనద్కట్‌ బౌల్ చేసిన 42 బంతులు ఎదుర్కొని 100 పరుగుల చేశాడు.ఐపీఎల్‌లో ఇంత తక్కువ బంతుల్లో ఓకే బౌలర్‌ బౌలింగ్‌లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

ఈ లిస్టులో సురేశ్‌ రైనా, ఏబీ డివిల్లియర్స్‌, కీరన్‌ పొలార్డ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.సురేశ్‌ రైనా సందీప్‌ శర్మ బౌలింగ్‌లో 47 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లో ముంబై 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచగా ఆ జట్టు 7 వికెట్లు నష్టానికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది.ఎంఎస్ ధోనీ లాస్ట్ ఓవర్ లో 16 రన్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.

దీంతో రియల్ ధోనీ ఇస్ బ్యాక్ అని అభిమానులు సంతోషంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఏదేమైనా ధోని గట్టి పట్టుదలతో తన సత్తా చాటుతూ తోటి ఆటగాళ్ల అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube