యాంకర్ సుమ ( Anchor suma )జయమ్మ పంచాయతీ అనే సినిమా తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.గతం లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సుమ యాంకర్ గా మాత్రమే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
యాంకర్ గా లేడీస్ సూపర్ స్టార్ అంటూ పేరు సొంతం చేసుకున్న సుమకి వెండి తెర పై సక్సెస్ అవ్వాలని ఆశ ఎప్పటి నుండో ఉందట.అందులో భాగంగానే జయమ్ము పంచాయతీ( jayamma panchayithi ) చిత్రం తో మరో సారి తన అదృష్టాన్ని సుమ పరీక్షించుకుంది.
అదృష్టం కలిసి రాలేదు.బుల్లి తెర పై సుమ సూపర్ స్టార్ అనడం లో సందేహం లేదు.
కానీ వెండి తెర పై ఆమె కు అంతగా కలిసి రాక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.జయమ్మ పంచాయతీ సినిమా కు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
కానీ సినిమా కి నెగటివ్ టాక్ వచ్చింది.ఈ మాత్రం ఆకట్టుకునేలా లేదు అంటూ కొందరు పెదవి విరిచారు.
ఆ సినిమా ఫలితం తో సుమ మళ్లీ సినిమాల్లో నటించేందుకు వెనకాడుతోంది.వెండి తెర పై సెకండ్ ఇన్నింగ్స్( Second innings ) మొదలు పెట్టాలని భావించిన సుమ జయమ్మ పంచాయితీ ఇచ్చిన షాక్ తో మళ్లీ సినిమా అంటే భయపడుతోంది.ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ఆమె ను సంప్రదించిన కూడా వద్దు బాబోయ్ అంటూ వెనకడుగు వేస్తోందట.ప్రస్తుతానికి సినిమాలు చేసే ఉద్దేశం లేనేలేదు అంటూ తనను సంప్రదించిన వారికి చెప్పిందట.
ప్రముఖ స్టార్ హీరో సినిమా లో కీలక పాత్ర కోసం సుమ ను సంప్రదించిన సమయం లో ఆమె సున్నితంగా తిరస్కరించిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ముందు ముందు అయిన సుమ సినిమాల్లో నటిస్తుందా అంటే అనుమానమే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.