సంధి కాలంలో పవన్ కళ్యాణ్?

వెనకకువెళ్లాలో ముందుకు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిని సంధికాలంగా వర్ణిస్తారు.తన ముందు చాలానే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకునే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఇప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి.

 Pawan Kalyan Is In Dialoma To Take Decesion, Pawan Kalyan , 2024 Elections, J-TeluguStop.com

బాజాపా తో కలిసి వెళ్లాలనే విషయంలో నిజాయితీగానే ఉన్నప్పటికీ భాజపా అధినాయకత్వం ప్రవర్తన తో ఆయన అయోమయం లో పడ్డారని అంటున్నారు….వైసిపి ప్రభుత్వం అరాచక పాలన పై పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భాజపా అధినాయకత్వం వేచి చూచే ధోరణి అవలంబించాలని సూచించడం పవన్ కి అంత రుచించలేదని తెలుస్తుంది ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటన్న ప్రశ్నఆయనని వేధిస్తుందని భాజపాతో కలిసి నడవాలా లేక తనదారి తను చూసుకోవాలా అన్న మీ మీమాంస లో ప్రస్తుతం ఆయన ఉన్నారంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి.

Telugu Chandrababu, Janasena, Modi, Pawan Kalyan, Telugu Desam, Ysrcp-Telugu Pol

వైసీపీ ప్రభుత్వం( YSRCP ) పై తాను చేసే నిరసన కార్యక్రమాలకు తక్షణ మద్దతు భాజపా నుంచే వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైందని కేవలం ఎన్నికల కేంద్రంగానే బాజాపా( BJP ) నిర్ణయం తీసుకోవడం ఆయన అసంతృప్తికి గురి చేస్తుందని తెలుస్తుంది.

Telugu Chandrababu, Janasena, Modi, Pawan Kalyan, Telugu Desam, Ysrcp-Telugu Pol

తెలుగుదేశం పొత్తు( Telugu Desam Party ) పై కూడా ఆయనకు చాలా అనుమానాలు ఉన్నాయి తెలుగుదేశం నాయకత్వం తనకు కావలసిన మర్యాద ఇస్తూనే ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తుందని….ఎన్నికల సమయానికి తమ గౌరవానికి భంగం కలగకుండా సీట్లను కేటాయిస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా ఆయనకు ఉన్నాయని తెలుస్తుంది .తమకు అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకునే బలమైన మీడియా సపోర్ట్ ఉన్న తెలుగు దేశాన్ని పూర్తిస్థాయిలో నమ్మలేమని అయితే వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అన్న తమ లక్ష్యానికి తెలుగుదేశం మద్దతు కూడా తప్పనిసరి అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం కర్ర విరగకుండా పాము చావకుండా ముందుకు వెళ్లడంఎలా ఉన్నదే ఆయన ముందున్న అతి పెద్ద ప్రశ్న ….పార్టీ మొదలైనప్పటి నుంచి పట్టుదలగా పనిచేస్తున్న జనసేనకులకు గౌరవానికి భంగం కలగకుండా పొత్తు కుదిరిలా చేయడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్ అని తెలుస్తుందిమరి ఈ సంధి కాలాన్ని ఆయన ఎంత నేర్పుతో ఎదురుకుంటారన్నదాన్ని బట్టి జనసేన విజయం ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube