Lasya : నా పిచ్చిని భరించే శక్తి నీకు మాత్రమే ఉంది.. లాస్య మంజునాథ్ వైరల్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య( Anchor lasya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన యాంకరింగ్ తో చలాకీ మాటలతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని లాస్య ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న తెలిసిందే.

 Anchor Lasya Shares Emotional Post Her Husband Manjunath Birthday-TeluguStop.com

ఎప్పుడూ నవ్వుతూ సరదాగా సందడి సందడి చేస్తూ ఉంటుంది.ఇక తెలుగు ఫిమేల్ యాంకర్ లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లాస్య పెళ్లి తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది.ఇక పోతే యూట్యూబ్ లో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన లాస్య యూట్యూబ్ ఛానల్( Lasya YouTube Channel ) ద్వారా ఎన్నో వీడియోలు చేస్తూ తన అభిమానులకు చేరువగా ఉంటోంది.

అలాగే తన యూట్యూబ్ ఛానల్ ఖాతా ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ప్రస్తుతం బుల్లితెరపై అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే యాంకర్ లాస్య ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా లాస్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

తాజాగా మార్చ్ 16 తన భర్త మంజునాథ్‌( Manjunath ) బర్త్‌డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పై ప్రేమ కురిపిస్తూ ఆసక్తికర పోస్ట్‌ చేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈ సందర్బంగా లాస్య ట్వీట్ చేస్తూ.

హ్యాపీ బర్త్‌డే మంజునాథ్‌.నువ్వు నన్ను నవ్వించావు.నా కన్నీళ్లు తుడిచావు.

నన్ను గట్టిగా హత్తుకున్నావు.నా సక్సెస్‌ను చూశావు.

నా వైఫల్యాలను చూశావు.ఎలాంటి సమయంలోనైన నా పక్కనే నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు.

లవ్‌ యూ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా ఒక పర్పెక్ట్‌ హస్పెండ్‌కు భార్యగా గర్వపడుతున్నాను అంటూ లాస్య భావోద్వేగానికి లోనయ్యింది.

ఆ పోస్ట్ చూసిన అభిమానులు ఈ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇంకొందరు అభిమానులు క్యూట్ కపుల్ అంటూ లాస్య మంజునాథ్ లపై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube