మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) భారతదేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.ఈ బిజినెస్ మాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ చమత్కారమైన, ఆలోచింపజేసే ట్వీట్లను చేస్తుంటారు.
అంతేకాదు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుతుంటారు.ఇటీవల ఆనంద్ మహీంద్రా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పర్యటన( Indore Tour ) గురించి ట్వీట్ చేశారు.
తన భార్యను తొలిసారిగా ఇండోర్ నగరంలోనే కలిసినట్లు చెప్పి అందర్నీ ఫిదా చేశారు.
తన భార్యను ఫస్ట్ టైమ్ కలిసిన ఈ నగరానికి రావడం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందన్నారు.“ఇండోర్ వెళ్ళి సతీమణిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అదేదో రొమాంటిక్ మూమెంట్ అనుకోకండి, ఆర్‌బీఐ మీటింగ్ కోసం ఆ నగరానికి వెళ్లాల్సి వచ్చింద”ని ఆయన వివరించారు.ఇండోర్ స్వచ్ఛమైన, అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇది భారతదేశంలో బెస్ట్ ‘నేషనల్ స్మార్ట్ సిటీ'( National Smart City )గా ఎంపిక అయిందని ఆయన పేర్కొన్నారు.
ఇక ఆనంద్ మహీంద్రా భార్య పేరు అనురాధ మహీంద్రా( Anuradha Mahindra ).ఆమె జర్నలిస్ట్, లగ్జరీ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ వెర్వ్ వ్యవస్థాపకురాలు.మ్యాన్స్ వరల్డ్( Man’s World India Magazine ) అనే మ్యాగజైన్‌ను కూడా ఆమె కో-ఫౌండ్ చేశారు.అనురాధ మహీంద్రా ముంబైలో పుట్టి పెరిగారు.ముంబైలోని సోఫియా కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.సోఫియా కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె ఆనంద్ మహీంద్రాను కలిశారు.ఆ సమయంలో ఆనంద్ ఇండోర్‌లో తన బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్ ఫిల్మ్ తీస్తున్నారు.1989లో వివాహం చేసుకున్న వీరికి దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.