అగ్రరాజ్యం అమెరికాలో వర్ణ వివక్ష రాజ్యమేలుతోంది.తరచూ నల్ల జాతీయులపై అక్కడ వివక్ష చూపుతున్న ఘటనలు జరుగుతుంటాయి.
కొన్నాళ్ల క్రితం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని తెల్ల జాతీయుడైన పోలీసు తొక్కి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలిచి వేసింది.దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
ఈ తరుణంలో అమెరికాలోని కుల వివక్ష కూడా ఉందని పలు సర్వేలలో తేలింది.దీంతో ఆ దేశంలోని సియాటెల్ నగరంలో ఆసక్తికర ఘటన జరిగింది.
కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక చట్టం అమల్లోకి తీసుకొచ్చారు.సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.6-1 ఓట్ల తేడాతో ఆ తీర్మానానికి ఆమోదం లభించింది.
యుఎస్‌లోని గూగుల్, ఫేస్బుక్, ఆపిల్‌తో సహా 250 కి పైగా టెక్ కంపెనీలలో కుల ప్రాతిపదికపై వివక్షతపై ఫిర్యాదులు అందాయి.ఇది మాత్రమే కాదు, ప్రతి ముగ్గురు దళితులలో ఇద్దరు వారు పనితీరు సమయంలో వివక్షను అనుభవించాల్సి ఉందని సర్వేలలో చెప్పారు.కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన తొలి నగరంగా సియాటెల్ చరిత్రకెక్కింది.
అయితే దీనిపై భారతీయ అమెరికన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో కుల వివక్ష లేదని, తాము సియాటెల్ కౌన్సిల్ చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని భారత నేపథ్యమున్న అమెరికన్ సెనేటర్ నీరాజ్ అంటాని పేర్కొన్నారు.ఇది హిందూ వ్యతిరేకమని అంటానీ ఆరోపించారు.ఈ వర్ణవివక్ష విధానానికి బదులుగా హిందువులను వివక్ష నుండి రక్షించే విధానాన్ని సియాటెల్ రూపొందించాలని ఆయన అన్నారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించిన అమెరికాలో సీటెల్ మొదటి రాష్ట్రంగా మారింది.ఓ వైపు విమర్శలు వస్తున్నప్పటికీ మరో వైపు దీనిపై ప్రశంసలు కూడా వస్తున్నాయి.