అమెజాన్‌లో అదిరిపోయే ఫీచర్... మీఫోన్‌ కేస్‌పై మీకు నచ్చిన ఇమేజ్‌ సెట్ చేయొచ్చు!

దేశీయంగా ఒకసారి గమనిస్తే ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు ప్రజలు రోజురోజుకీ మొగ్గు చూపుతున్నారు.ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌( Flipkart, Amazon ) వంటి సంస్థల రాకతో యువత ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ( Online shopping )అంటే ఇష్టత కనబరుస్తున్నారు.

 Amazing Feature On Amazon You Can Set The Image You Like On My Phone Case , Amaz-TeluguStop.com

ఆ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు నూతన ఆఫర్లతో కస్టమర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆకట్టుకుంటున్న పరిస్థితి.వివిధ రకాల సేల్స్‌ పేరుతో ఎప్పటికప్పుడు అన్ని ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందించడంతో ఆన్లైన్ అమ్మకాలపై మంచి గిరాకీ ఏర్పడింది.

ఇక ఆఫ్‌లైన్‌ మార్కెట్‌తో పోల్చుకుంటే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో తక్కువ ధరలకు, ఎక్కువ మోడల్ ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Amazon India, Products, Latest Tech, Prime Day Sale-Technology Telugu

ఈ క్రమంలోనే, యువత అభిరుచికి తగ్గట్టు అమెజాన్‌ ఫోన్‌ కేస్‌లు, స్క్రీన్‌ గార్డులు( Amazon phone cases, screen guards ) వంటి ఉత్పత్తులను నచ్చినట్లుగా డిజైన్‌ చేసేటువంటి ఓ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది.బహుమతులు ఇవ్వడం కోసం లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అయితే ఫోన్‌ కేస్‌లు వంటివాటిపైన మీకు నచ్చిన ఫోటోను అచ్చువేసి ఇచ్చినందుకు అదనపు ఖర్చు ఉండదని కంపెనీ చెబుతుంది.

ఈ క్రమంలో 76 విభిన్న వర్గాలలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తులు ఈ ఎంపికతో అందుబాటులో ఉన్నాయని కంపెనీ చెప్పుకొస్తుంది.కొత్త కస్టమైజేషన్ ఆప్షన్ జూలై 15న ప్రైమ్ డే సేల్‌తో( Prime Day sale on the 15th ) వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

Telugu Amazon India, Products, Latest Tech, Prime Day Sale-Technology Telugu

ఈ ఫీచర్ కింద మీరు వివిధ రకాల ఫోన్ కవర్‌లు, సీసాలు, మగ్‌లు, కీచైన్‌లు, వాచీలపై మీరు బ్యాడ్జ్‌ని గుర్తించవచ్చు.ఫర్నిచర్, కర్టెన్లు, కిచెన్ అప్రాన్‌లతో సహా అనేక గృహ వస్తువులు కూడా “కస్టమైజేషన్‌” ( Customization )ఎంపికతో అందుబాటులోకి రానున్నాయి.వినియోగదారులు ఎంచుకున్న బ్రాండ్‌లతో ఫోన్ కవర్‌ల కోసం ఇష్టమైన చిత్రాలు, నచ్చిన కొటేషన్లను కూడా కూడా అప్‌లోడ్ చేయవచ్చు.ఫాంట్ కూడా మీకు నచ్చింది ఇక్కడ మార్చవచ్చు.

అయితే ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు కస్టమర్‌లు పరిమాణం, రిజల్యూషన్‌ను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube