అల్లు అర్జున్( Allu Arjun ) టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరో అనే విషయం మనందరికీ తెలిసిందే.అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీ కి రావడానికి అయన ఒక మంచి హీరోగా నిలదొక్కుకోవడానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు చాలా హెల్ప్ చేశారు కెరియర్ మొదట్లో వాళ్ల పేర్లు చెప్పుకుంటునే సినిమాలు హిట్ చేసుకున్నాడు.
కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ని పట్టించుకోవడం మానేశాడు.చిరంజీవి గురించి గానీ, పవన్ కళ్యాణ్ గురించి గానీ అసలు ఎక్కడ మాట్లాడటం లేదు… ఇప్పటికే సరైనోడు ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతుంటే అభిమానులు పవన్ కళ్యాణ్ అని అరుస్తుంటే అల్లు అర్జున్ మాత్రం నేను చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేశాడు… దాంతో అప్పుడు ఈ రెండు ఫ్యామిలీ లా మధ్య ఏదో వైరం నడుస్తుంది అని అందరూ అనుకున్నారు.
కెరియర్ మొదట్లో మాత్రం సినిమాలు హిట్ కావడానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి ( Pawan Kalyan, Chiranjeevi )ఇద్దరిని కూడా గెస్ట్ లుగా పిలిచేవాడు.జులాయి ఆడియో ఫంక్షన్ లో అయితే పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో ఆయన లేకపోతే అసలు నాకు లైఫ్ లేదు, ఆయన్ని చూస్తేనే నాకు స్టార్ అనే పదానికి అర్థం లా కనిపిస్తాడు అంటూ మాట్లాడాడు.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు అడిగిన కూడా మాట్లాడటం లేదు.ఇక ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ చెప్పాడో అప్పటి నుండి ఈయన మెల్లగా మెగా నీడ నుండి బయటకి రావడం ప్రారంభించాడు.
మెగా ఫ్యామిలీ పేరు ఎత్తడం పూర్తిగా మానేసి, అల్లు ఫ్యామిలీ అంటూ మాట్లాడడం ప్రారంభించాడు.ఇక పుష్ప సినిమా సక్సెస్ అయ్యి ఆయనకీ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ వచ్చిన తర్వాత ఇక మెగా కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు అని అనిపిస్తుంది.
నిన్న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది సెలబ్రిటీస్ ఆయనకి బర్త్ డే విషెస్ తెలియ చేశారు.దానికి థాంక్యూ అంటూ రీప్లే కూడా పెట్టడు అయితే చిరంజీవి పెట్టిన మెసేజ్ కి మాత్రం ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది…ఇక ఇది చూసిన చాలా మంది సినీ మేధావులు అల్లు అర్జున్ కి అంత ఆటిట్యూడ్ ఉంటే కష్టం అని అంటున్నారు…
.