టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎస్.
ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటినుంచి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నారు.
కాకుండా అరుదైన ఘనతలను సాధిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి.
![Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/alia-bhatt-rrr-r-ajamouli-tollywood-advice-Rama-charan-ntr-bollywood.jpg)
ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న జక్కన్న తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు.టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన నూరు మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి కి కూడా స్థానం దక్కింది.
![Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/alia-bhatt-rrr-r-ajamouli-tollywood-advice.jpg)
దాంతో అభిమానులు ప్రముఖులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia bhatt ) కూడా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఆలియా భట్ మాట్లాడుతూ.
మొదటిసారి రాజమౌళిని బాహుబలి ప్రీమియర్ లో కలిసాను.ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆశ్చర్యపోయాను.
ఎలా అయినా ఆయన దర్శకత్వంలో నటించాలని అనుకున్నాను.ఆర్ఆర్ఆర్ సినిమాతో నా కల నెరవేరింది.
![Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie Telugu Alia Bhatt, Bollywood, Ajamouli, Rajamouli, Rama Charan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/alia-bhatt-rrr-r-ajamouli-tollywood-Rama-charan.jpg)
నా కోరిక తీరింది.రాజమౌళి గారి దగ్గర పని చేయడం అంటే స్కూల్ కి వెళ్లడంతో సమానం.ఎన్నో మంచి మంచి విషయాలు కొత్త కొత్త అంశాలను నేర్చుకోవచ్చు.నేను ఆయనను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను.ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు.తన సినిమాల ద్వారా అందరినీ ఒకే చోటుకి చేర్చుతారు.
నటన పరంగా నాకు ఏదైనా సలహా ఇవ్వమని కోరాను.అప్పుడు రాజమౌళి గారు ఏ క్యారెక్టర్ లో నటించిన దానిని ప్రేమతో చేయాలని చెప్పారు.
సినిమా ప్రేక్షకాధరణ పొందకపోయినా మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలి అని సలహా ఇచ్చారు అంటూ రాజమౌళి పై ప్రదర్శన ప్రశంసల వర్షం కురిపించింది ఆలియా భట్.కాగా హీరోయిన్ అలియా భట్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్( Rama charan ) సరసన సీత క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.