ట్రైలర్ టాక్ : ఆ సోగ్గాడే ఈ బంగార్రాజు, బొమ్మ అదుర్స్

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన కు సీక్వెల్ గా రూపొందిన చిత్రం బంగార్రాజు.ఈ సినిమా లో నాగార్జున కు తోడు ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా నటించాడు.

 Akkineni Nagarjuna Naga Chaitanya Ramya Krishna Krithi Shetty Bangarraju Trailer-TeluguStop.com

తండ్రీ కొడుకులు హీరోలు గా నటించడం తో పాటు బంగార్రాజు పాత్రలోనే ఇద్దరు కూడా కనిపించబోతున్నారు అనే వార్తలు సినిమా పై అంచనాలు భారీగా పెంచింది.  సోగ్గాడే చిన్నినాయన సినిమాలో  నాగార్జున ఎలా కనిపించాడో ఇప్పుడు చైతు కూడా అలాగే కనిపించబోతున్నాడు.

  నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించిన చిత్రం కావడంతో బంగార్రాజు పై అంచనాలు భారీగా ఉన్నాయి.పైగా ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది.

సంక్రాంతికి రావల్సిన భారీ చిత్రాలు పెద్ద చిత్రాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి.కనుక ఈ  సినిమా కి  ఖచ్చితంగా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.

బంగార్రాజు సినిమా కు భలే మంచి టైం ఇది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇలాంటి సమయం లో విడుదలైన బంగార్రాజు ట్రైలర్కు మంచి రెస్పాన్స్ దక్కింది.

ట్రైలర్ లో నాగార్జున మరియు నాగచైతన్య ల స్పీడు చూస్తుంటే సోగ్గాడే చిన్ని నాయన కు ఏమాత్రం తగ్గడం లేదు అన్నట్లుగా ఈ సినిమా ఉండబోతోందని అన్నట్లు అనిపిస్తుంది అని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమా లో ఓ రేంజ్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా  ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.ఆమె గ్రామంలో సర్పంచ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక నాగచైతన్య అమ్మాయిల చుట్టూ తిరిగే కుర్రాడిగా కనిపించబోతున్నాడు.

మరి కృతి శెట్టి కి మరియు నాగచైతన్యకు ఎలా సెట్ అవుతుంది, స్వర్గం నుంచి వచ్చిన నాగార్జున అసలు ఏం చేస్తాడు, నాగచైతన్య తండ్రి మరియు తల్లి ఎలా చనిపోతారు అనే విషయాలు  సినిమాలో చూడాల్సి  ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube