ప్రేమలో నయన్‌?

తమిళ స్టార్‌ హీరోయిన్‌ నయనతార గతంలో హీరో శింబుతో ప్రేమలో పడి, ఆ తర్వాత బ్రేకప్‌ అయిన విషయం తెల్సిందే.ఆ తర్వాత కొంత కాలానికి ఈ అమ్మడు దర్శకుడు ప్రభుదేవ ప్రేమలో మునిగి తేలింది.

 Nayanthara In Love With A Director-TeluguStop.com

వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది.అయితే కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది.

ఆ తర్వాత నయన్‌ మరో హీరో ఆర్యతో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వచ్చాయి.అయితే ఆ వార్తలను నయన్‌ పలు సార్లు తోసిపుచ్చింది.

తాజాగా మరోసారి నయన్‌ ప్రేమ గురించి తమిళ మీడియాలో హాట్‌ హాట్‌ వార్తలు ప్రసారం అవుతున్నాయి.ఈ అమ్మడు ప్రస్తుతం ఒక యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆ దర్శకుడినే త్వరలో ఈమె పెళ్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు.వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని, త్వరలో వీరి వివాహ అధికారిక ప్రటన వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

నయన్‌ ప్రేమ ఈసారైనా పెళ్లి పీఠల వరకు వెళ్లేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube