హైదరాబాద్: కరాటే కళ్యాణి మాట్లాడుతూ.రెండు రోజుల నుండి నా పై అనేక ఆరోపణలు వచ్చాయి.
నేను పాపను దత్తత తీసుకోలేదు.పాపా తల్లి తండ్రులు మా తో పాటే వుంటున్నారు.
నేను దత్తత తీసుకుంటే లీగల్ గా నే తీసుకుంటాను.నాకు అధికారులు ఎలాంటి నోటీస్ లు ఇవ్వలేదు.
నోటీస్ లు ఇవ్వకుండా మా ఇంటి పై కి విచారణ పేరుతో వచ్చారు.కలెక్టర్ ను కూడా రాలేదు.
నేను క్లీన్ చిట్ గా బయట కు వచ్చాను.మా అమ్మ, తమ్ముడు ఆత్మ హత్య చేసుకుంటామని అన్నారు.
మనం తప్పు చెయ్యలేదు అని వారికి ధైర్యం చెప్పాను.
నాపై ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిని తొందర లో నే లీగల్ గానే ఎదుర్కొంటాను.
నేను బీసీ బిడ్డను, నన్ను రాజకీయంగా ఎదుర్కొన లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.నేను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తాను అని అధికారుల కు చెప్పాను.
నా పై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు వున్నారు.