తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ( Srinivas Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ సినిమాలలో కూడా కమెడియన్ గా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ రెడ్డి కాస్త సినిమాలను తగ్గించాలని చెప్పాలి.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎన్టీఆర్( NTR ) కు జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదం(Road Accident) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) తరఫున ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసింది.ఇలా ప్రచారానికి వెళ్లిన సమయంలో ఖమ్మం దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఎన్టీఆర్ తీవ్ర గాయాలు పాలయ్యారు.అదృష్టం కొద్ది ఈయన ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారని చెప్పాలి .అయితే ఈ ప్రమాదం గురించి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలకు వస్తున్నారు అనే విషయం తెలియడంతో ఆయన తనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు.అయితే ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఖమ్మం దగ్గర ప్రచారం చేస్తుండగా నేను ఆరోజు పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నానని తెలిపారు.ఇక అంతా పూర్తి అయ్యి బయలుదేరే సమయంలో ఎన్టీఆర్ ఒక వెహికల్ లో వెళ్తున్నారు .నన్ను కూడా అక్కడికి రమ్మని చెప్పారు.అయితే నేను నా బ్యాగ్ కోసం వెళ్లగా అప్పటికే మరొకరు రావడంతో ఆ కారులో తనని ఎక్కించుకొని ఎన్టీఆర్ వెళ్లిపోయారు.
ఇక ఎన్టీఆర్ వెహికల్ వెనుకనే మా కారు కూడా వెళ్తుంది అయితే కొంత దూరం పోగానే ఆ కారు రోడ్డు ప్రమాదానికి గురైందని ఎన్టీఆర్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉండడం చూసి వెంటనే నా బ్యాగ్ లో ఉన్నటువంటి టవర్ తీసి ఆయనకు కట్టి దగ్గర్లో నాకు తెలిసిన హాస్పిటల్ కి తనని తీసుకెళ్ళామని తెలిపారు.
ఇలా అక్కడ డాక్టర్ ఎన్టీఆర్ ని చూడగానే తనకు కుట్లు వేయడానికి చాలా వనికిపోయారు అయితే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తనని తిరిగి సిటీకి తరలించామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అలా ఆరోజు యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో వచ్చారు.కానీ కొంతమంది మాత్రం నేనంటే గిట్టని వారు తన గురించి ఒక బాడ్ రూమర్ వైరల్ చేశారు నేను ప్రచార కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే ఎన్టీఆర్ కి అలాంటి ప్రమాదం జరిగింది అంటూ మాట్లాడారు.
ఆ విషయం నన్ను చాలా బాధ కలిగించింది నిజానికి నేను అక్కడ ఉండబట్టే ఎన్టీఆర్ బ్రతికారాన్ని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఇక ఈ విషయం ఎన్టీఆర్ వద్ద కూడా వారు ప్రస్తావించారేమో తెలియదు కానీ అప్పటినుంచి నాకు ఎన్టీఆర్ కి మధ్య చిన్న గ్యాప్ అయితే ఏర్పడిందని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.