ప్రస్తుతం ఇండస్ట్రీ లో బలంగా ట్రెండ్ అవుతున్న పేరు నవీన్ పోలిశెట్టి.రీసెంట్ గా ఈ కుర్ర హీరో నుండి ‘మిస్ శెట్టి.
మిస్టర్ పోలిశెట్టి'( Miss Shetty Mister Polishetty ) అనే సినిమా విడుదల అయ్యింది.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం నవీన్ పోలిశెట్టి.తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వాల్సిన సమయం లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు, అలాగే సెంటిమెంట్ సన్నివేశాల్లో( Sentiment Scenes ) అదే రేంజ్ లో ఏడిపించాడు కూడా.
ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు, టాలీవుడ్ లో కాబొయ్యే మెగాస్టార్ చిరంజీవి అంటూ నవీన్ పోలిశెట్టి ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా నవీన్ పోలిశెట్టి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టాలీవుడ్ భవిష్యత్తు నవీన్ పోలిశెట్టి చేతిలో సురక్షితంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు రీసెంట్ గా సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ( Actor Brahmaji ) కూడా నవీన్ పోలిశెట్టి టాలెంట్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.ఆయన మాట్లాడుతూ ‘ ఈ అబ్బాయి టాలెంట్ చూస్తే భయం వేస్తుంది.ఇక నేను రిటైర్ అయిపోవడం బెటర్’ అంటూ కామెంట్ చేస్తాడు.
అప్పుడు నవీన్ పోలిశెట్టి దానికి రిప్లై ఇస్తూ ‘మీకు పవర్ ఉంది.మాకు బ్రెయిన్ ఉంది.
ఇద్దరం కలిస్తే’ అని కామెంట్ చేస్తాడు.అప్పుడు బ్రహ్మాజీ ‘అంటే నాకు బ్రెయిన్ లేదా’ అని స్మైల్ ఎమోజి ని పెట్టి రిప్లై ఇస్తాడు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా( Social Media ) లో బాగా వైరల్ అయ్యింది.బ్రహ్మాజీ ట్విట్టర్ లో సెలబ్రిటీస్ తో చాలా సరదాగా ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
వెన్నెల కిషోర్, సాయి ధరమ్ తేజ్, అడవి శేష్ వంటి వారితో ఎన్నో సార్లు సరదాగా ఇలా చిట్ చాట్ చేసాడు.
ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కూడా ఇలా సరదాగా మాట్లాడడం చూసే నెటిజెన్స్ కి చాలా సరదాగా అనిపించింది.ఇక నవీన్ పోలిశెట్టి ని అయితే కామెంట్స్ లో అభిమానులు సినిమాలు తొందరగా చెయ్యమని గోల పెట్టేస్తున్నారు.సినిమాలు ఫాస్ట్ గా చేస్తే టాలీవుడ్ లో నీ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయి కి వెళ్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు'( Jathi Ratnalu ) తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి, ఈసారి ఎంత సమయం తీసుకుంటాడో చూడాలి.ప్రస్తుతం ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు, శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.