స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( vijay devarakonda )గురించి ప్రత్యేకంగా చొప్పునక్కర్లేదు.విజయ్ దేవరకొండ తాజా ఖుషి సినిమా( Kushi Movie )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ సక్సెస్ ను సాధించడంతో సంతోషంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విజయ్.తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.
100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు దీని వల్ల విజయ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి.విజయ్ రూ.కోటి ఇస్తానని ప్రకటన చేయడంపై ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది.డియర్ విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాము.కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు.మీరు ఇప్పుడు.100 కుటుంబాలకు ఎంతో పెద్ద మనసుతో రూ.కోటి ఇస్తామని ప్రకటించారు.అలా ఎగ్జిబిటర్ల్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీని ఆదుకుంటారని కోరుతున్నాం అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.
ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త ఇండస్ట్రీలో పాత సమస్యల‍్ని బయటకు తీసుకురావడం మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకు లేని కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెట్టింది.అయితే ఒక సినిమా విషయంలో లాభం, నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్స్( Distributors ) నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం.మరి ఇలా పబ్లిక్ గా విజయ్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఏంటా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ఈవెంట్లో ప్రకటించిన విధంగా కోటి రూపాయలను వంద ఫ్యామిలీలకి అందరు చేస్తారా లేదంటే ఆపేస్తారా అన్నది చూడాలి మరి.