టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఆయన వారసుడిగా తన కుమారుడు ఆకాష్ పూరి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర పోరి సినిమాతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేసిన ఆకాష్ తాజాగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్లగణేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పలు విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే ఈ వేదికపై ఆకాష్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేపోటిజం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
నెపోకిడ్ ని మహా అయితే హీరోగా లాంచ్ చేయగలరు కానీ.సక్సెస్ చేయలేరనీ ఆకాశ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే టాలెంట్ ఉండాలి తప్ప స్టార్ సెలబ్రిటీల కుమారుడు కొడుకు అయినంత మాత్రాన సక్సెస్ కారని తెలిపారు.
ఇక చాలామంది తనను ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నువ్వు మీ నాన్నతో కాకుండా ఇతర డైరెక్టర్లతో ఎందుకు సినిమా చేస్తున్నావు అని చాలామంది అడుగుతూ ఉంటారు.నెపోటిజాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలంటే.నాన్న ఆ లైగర్ సినిమా నాతోనే తియ్యి అని అడిగేవాడిని.
నేను అడిగితే నాన్న సినిమా నాతో చేస్తారు కానీ నేను అలా చేయను నేను కష్టపడి నాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిన తరువాత నాన్న స్థాయికి ఎదిగినప్పుడు తనతో కలిసి సినిమా చేస్తా అంతవరకు నాన్నతో సినిమా చేయనని ఈ సందర్భంగా ఆకాశ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.