బాలకృష్ణకు రూ.6 కోట్ల బహుమతి ఇచ్చిన హరీష్ రావు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.బాలకృష్ణ గతేడాది బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమాలో అఘోర పాత్రలో అద్బుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

 Star Hero Balakrishna Comments About Hareesh Rao Goes Viral Details, Balakrishna-TeluguStop.com

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న సినిమాకు సంబంధించి వేర్వేరు విడుదల తేదీలు ప్రచారంలోకి వస్తున్నాయి.

దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.బాలయ్య ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలను నిర్వహిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు.

అయితే తెలంగాణ మంత్రి హరీష్ రావు బాలకృష్ణ ఆరు కోట్ల రూపాయల విలువలైన బహుమతి ఇచ్చారు.అయితే ఈ బహుమతి వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతి కాకుండా పేదలకు మేలు చేసే ఉద్దేశంతో ఇచ్చిన బహుమతి కావడం గమనార్హం.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చెల్లించాల్సిన ఆరు కోట్ల రూపాయల పన్నుకు తెలంగాణ సర్కార్ మినహాయింపును ఇచ్చింది.

Telugu Anil Ravipudi, Balakrihsna, Hareesh Rao, Harish Rao Gift, Harish Rao-Movi

ఇందుకు సంబంధించి బాలయ్య స్పందిస్తూ హరీష్ రావును జన నాయకుడని పేర్కొన్నారు.హరీష్ రావును తాను ఒకసారి కలిస్తే ఆరు కోట్ల రూపాయల పన్నును మాఫీ చేశారని బాలయ్య చెప్పుకొచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ బాలయ్య వేర్వేరు రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు.

Telugu Anil Ravipudi, Balakrihsna, Hareesh Rao, Harish Rao Gift, Harish Rao-Movi

బాలయ్య, హరీష్ రావు ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకోవడం గమనార్హం.బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా రాజశేఖర్ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube