పక్షుల కోసం కొత్త అంబులెన్స్ రెడీ.. ఎక్కడంటే..

మనుషుల కోసం అంబులెన్స్‌లు ఉండటం కామన్ కానీ పక్షుల కోసం అంబులెన్స్ ఏంటని అవాక్కవుతున్నారా.అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే.అతని పేరు మెహ్రా.11 ఏళ్లుగా ఆపదలో ఉన్న పక్షులను ఇతను రక్షిస్తున్నాడు.రోడ్డు పక్కన చనిపోయిన పక్షులను గోతిలో గౌరవప్రదంగా పూడ్చుతున్నాడు. అంబులెన్స్ అంటే అతడు వ్యాన్‌లో వెళ్లడం కాదు సైకిల్ పైన ప్రయాణిస్తున్నాడు.ప్రిన్స్ మెహ్రా ఇతడి పూర్తి పేరు.చండీగడ్ రాష్ట్రంలో ఈ సైకిల్ బర్డ్ అంబులెన్స్ ను ప్రారంభించాడు.

 A New Ambulance Is Ready For Birds.. Where Prince Mehra, Bird Ambulance, Chand-TeluguStop.com

2011లో ఫిరోజ్ పూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మెహ్రాకి రోడ్డు పక్కన చెత్తకుండీలో రెండు పావురాలు చనిపోయి కనిపించాయి.అవి రెండూ కరెంట్ షాక్ వల్ల మరణించినట్లు అతడు తెలుసుకున్నాడు.

వాటిని చూసి చలించిపోయాడు.తర్వాత వాటిని కొంత దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు.

ఆ తర్వాత పక్షులను కాపాడాలని, చనిపోయిన పక్షులు పర్యావరణానికి హాని చేయకుండా వాటిని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా 11 ఏళ్లుగా ఈ పని చేస్తూ అందరి చేత పొగిడించుకుంటున్నాడు.

మెహ్రా సైకిల్‌పై నగరం చుట్టూ తిరుగుతూ చనిపోయిన పక్షులను కనిపెడుతుంటాడు.వాటిని డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు.మెహ్రా ఇప్పటివరకు 1,150 పక్షులకు చికిత్స చేయించి వాటి ప్రాణాలను కాపాడాడు.చనిపోయిన 1,254 పక్షులను ఖననం చేశాడు.అతని సేవలను గుర్తిస్తూ చండీగఢ్ పరిపాలన సంఘం రాష్ట్ర స్థాయి అవార్డులను అందించింది.అతని సేవలను మెచ్చుకుంటూ ఒక నేషనల్ బ్యాంక్ అతనికి ఈ-బైక్‌ను బహుమతిగా అందజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube