బాలీవుడ్ నటి తునిషా శర్మ ఇటీవలే మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే తునిషా శర్మ ఆత్మహత్య కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ఎందుకంటే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది.అంతేకాకుండా ఆమె ఆత్మహత్య కేసులో ఒక్కొక్క షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాగా గతనెల డిసెంబర్ 24న తునిషా శర్మ సెట్స్ లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే తునిషా శర్మ ఆత్మహత్యకి కారణం ఆమె ప్రియుడు షీజాన్ ఖాన్ అని ఆమె తల్లి వాదించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే.
దాంతో పోలీసులు అతని అరెస్టు చేసి హాస్పిటల్ సిసి టీవీ పుటేజ్, తునిషాకు ఆమె ప్రియుడికి మధ్య ఏం జరిగింది అన్న కోణంలో విచారిస్తున్నారు.ఇక తునిషా తల్లి తన కూతురు చనిపోవడానికి కారణం ఆమె ప్రియుడే అని ఆరోపిస్తుండగా షీజాన్ ఖాన్ కుటుంబ సభ్యులు మాత్రం తునిషా తల్లి ఆమెను చంపింది అంటూ ఘాటు ఆరోపణలు చేశారు.
ఇదే విషయంపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూతురు చనిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్న ఆమె స్వయంగా కూతుర్నే చంపాలని అనుకుంది.తునిషా మామగా చెప్పుకుంటున్న సంజీవ్ కౌశల్ కు ఆమె తల్లికి మధ్య ఏదో సంబంధం ఉంది.
అదే విషయం గురించి షీజాన్ కి తెలిసి ఆమెను నిలదీయడంతో అప్పటినుంచి షీజాన్ పై కక్ష కట్టింది.
తునిషా శర్మకు ఇష్టం లేని పనులను వారిద్దరు కలిసి ఎన్నో చేయించారు.ఇక కరోనా లాక్డౌన్ సమయంలో అయితే ఆమెకు ఇష్టం లేకుండా చండీగఢ్ కు కూడా పంపించాలని చూశారు.ఆ సమయంలో తునిషా వెళ్ళను అని మొండికేయడంతో ఆమెను కొట్టి ఫోన్ పగలగొట్టి గొంతు పిసికి చంపాలనుకున్నారు.
ఇదే విషయాన్ని తునిషా తన నటిస్తున్న షో డైరెక్టర్ తో చెప్పుకొని బాధపడింది.అయితే ఈ విషయాలన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఆమె తన కూతురిపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తోంది అని షీజాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరి ఈ కేసులో ఎవరు చెబుతున్నది నిజం అన్నది తెలియాలి అంతే వేచి చూడాల్సిందే మరి.ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.