పురాతన మంచు గడ్డలు చాలా గట్టిగా ఉంటాయి.ఎంతో పటిష్టంగా తయారు చేసిన టైటానిక్ షిప్ కేవలం ఓ మంచు కొండను ఢీకొని మునిగిపోయింది.
ఇక అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది.ఇక్కడ ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది.
రెండు మిలియన్ సంవత్సరాలు అంటే 20 ఏళ్ల మంచు గడ్డను కనుగొన్నారు.ఈ పరిశోధన సెంటర్ ఫర్ ఓల్డెస్ట్ ఐస్ ఎక్స్‌ప్లోరేషన్ (COLDEX) ప్రాజెక్ట్ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
దీని లక్ష్యం ప్రస్తుతం ఉన్న మంచు పలకల ఏ కాలం నాటివో కనుగొనేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
అంటార్కిటా ఖండంలోని ఓ పురాతన మంచు గడ్డపై పరిశోధకులు తమ పరిశోధనను కొనసాగించారు.ఇప్పటి వరకు కేవలం 8 లక్షల ఏళ్ల నాటి మంచు గడ్డలను మాత్రమే పరిశోధకులు కనుగొనగలిగారు.తాజాగా చేసిన పరిశోధనలో 93 మీటర్ల క్రిందికి కెమెరాను పంపించారు.
ఈ పరిశోధనను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని COLDEX అనే ప్రాజెక్టులో భాగంగా చేస్తున్నారు.ఇందులో భాగంగా భూమి వాతావరణం, పర్యావరణం గురించి తెలుసుకునేందుకు అంటార్కిటికాలో పరిశోధకులు అన్వేషణ చేస్తున్నారు.
కాలక్రమేణా సంభవించిన భూ వాతావరణ మార్పులను అనుసరించి ఎన్నో మార్పులు భూమి పొరల్లో జరుగుతుంటాయి.మంచు లోపలి పొరల్లో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలలో మార్పు కారణంగా అవి మరింత ఘనీభవిస్తాయి.
పురాతన మంచును అన్వేషించడానికి ఓ ప్రధాన కారణం ఉంది.లక్షల సంవత్సరాల క్రితం గ్రీన్‌హౌస్ వాయువు స్థాయిలు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.
అంటార్కిటికాలో ప్రస్తుతం చేపడుతున్న పరిశోధనకు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ నుంచి పాలియోక్లిమటాలజిస్ట్‌ల బృందం ఈ ప్రాజెక్టులో చేరింది.