పవన్ ని నమ్ముకోని వణికిపోతున్నారు

రికార్డుల పోటిలో నష్టపోయేది పంపిణిదారులే.సాటిలైట్ హక్కులు,థియేట్రికల్ రైట్స్ రూపంలో ఎంతోకొంత వెనకేసుకుంటాడు నిర్మాత.

 Sardaar Gabbar Singh Distributors Are Sleepless-TeluguStop.com

మరీ వరుసగా డిజాస్టార్లు పడితే, లేదా పైసా లాభం లేని డిజాస్టర్ పడితే కాని నిర్మాతకి నష్టాలు రావు.కాని పంపిణిదారుల పరిస్థితి అలా కాదు.

ఒక సినిమా హిట్ అయినా నష్టాలు రావొచ్చు.అతడు,జల్సా,బాద్షా,టెంపర్ .ఇలాంటి చిత్రాలు పేరుకైతే హిట్లే.కాని ఒకరో ఇద్దరో పంపిణిదారులు నష్టపోయారు.

ఇక మీరే అర్థం చేసుకోండి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో !

ఇప్పుడు సర్దార్ డిస్ట్రిబ్యూటర్స్ కి వెన్నులో వణుకు పుడుతోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .కేవలం ఈ బ్రాండ్ నేమ్ మీద నమ్మకం పెట్టుకోని, దాదాపు 80కోట్లు సినిమా మీద పెట్టేసారు.ఇది పవన్ కళ్యాణ్ కేరిర్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చెసిన అత్తారింటికి దారేది కన్నా, అయిదారు కోట్లు ఎక్కువ.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ 85-90 కోట్ల షేర్ సాధిస్తే తప్ప, పంపిణిదారులంతా బయటపడటం చాలా కష్టం.సినిమా ట్రైలర్ ఏమో అంతలా ఆకట్టుకోలేదు.అప్పటినుంచి ఈ భయం మరింతా ఎక్కువైపోయింది.మరీ ముఖ్యంగా ఓవర్సీస్ పంపిణిదారుల పరిస్థితి కష్టంగా తయారైంది.

ఎందుకంటే 10 కోట్లకు పైగా పెట్టేసారు.టాక్ ఏమాత్రం తేడా కొట్టినా, మొదట మునిగేది ఓవర్సీస్ పంపిణిదారులే!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube