అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ ఏం చేసినా సంచలనమే.ఏమాత్రం భయం లేకుండా వాఖ్యలు చేస్తూ ఉంటుంది తను.
చాలా సార్లు వివాదాల పాలైనా తన వైఖరి మాత్రం మార్చుకోలేదు ఈ అమ్మడు.తాజాగా మరో సంచలన వాఖ్య చేసింది సోనమ్.
బాలివుడ్ లో ఎవరితోనైనా డేటింగ్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తారు అనే ప్రశ్నకు బదులిస్తూ ” ఒకవేళ బాలివుడ్ లో ఒకరితో డేటింగ్ చేయాల్సి వస్తే , నేను కత్రినా కైఫ్ ను ఎన్నుకుంటా.తను అద్భుతమైన అందగత్తె.
తన కాళ్లు చాలా బాగుంటాయి.సరైన ఫిగర్ అంటే కత్రినాదే.
ఏ బట్టలు అయినా తనకి బాగా నప్పుతాయి.ఎంత చూడముచ్చటగా ఉంటుందో, అంతే హాట్ గా కుడా ఉంటుంది ” అంటూ కత్రినా మీద తనకున్న ఆకర్షణను బయటపెట్టేసింది ఈ సొగసరి.
సోనమ్ సల్మాన్ కి జంటగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో ఈ దీపావళి కి విడుదల కానుంది.ఇటివలే విడుదలైన ప్రచార చిత్రంలో తన ముఖారవిందంతో అందరిని ఆకట్టుకుంది సోనమ్.