బ్రూస్ లీ టీమ్ మీద ఐటి దాడులు

సరిగ్గా సినిమా విడుదల సమయంలో ఐటి దాడులు జరగడం సర్వసాధారణం అయిపొయింది.ఇది ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది.

 It Raids On Bruce Lee Team-TeluguStop.com

తెలుగు ఇండస్ట్రీలో ఇది తక్కువే అయినా, ఇంతకు ముందు దూకుడు,బిజినెస్ మెన్ చిత్రాల నిర్మాతల మీద కుడా ఇన్కంట్యాక్స్ దాడులు జరిగాయి.

ఇంకా వివరాలు పూర్తిగా తెలియకపోయినా, బ్రూస్ లీ టీమ్ మీద ఈ మధ్యాహ్నం నుండి దాడులు మొదలయినట్టు సమాచారం.

అయితే కేవలం నిర్మాత దానయ్య ఇంట్లోనే సోదాలు నిర్వహిస్తున్నారా లేకా రామ్ చరణ్ మీద కుడా ఐటి దాడులు నిర్వహించిందా అనేది ఇంకా తెలియరాలేదు.మీడియా వర్గాలకు తెలియకుండా పక్క ప్లానింగ్ తో వచ్చారు ఇన్కంట్యాక్స్ అధికారులు.

రామ్ చరణ్ బ్రూస్ లీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ఐటి దాడుల నేపథ్యంలో బ్రూస్ లీ బయ్యర్లలో కాస్త బెరుకు కనపడుతోంది.

అయితే భయపడేదేమి లేదని, పెద్ద సంచలనాలు జరిగే ఆస్కారం అస్సలు లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube