మెగా ఆఫర్‌ పుకార్లే

బుల్లి తెరపై తన సత్తా చాటిన ప్రభాకర్‌ త్వరలో వెండి తెరపై ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.అది కూడా మెగా హీరోను, గీతా ఆర్ట్స్‌లో అనే ప్రచారం బాగా జరుగుతోంది.

 Allu Arjun Warning To Allu Sirish-TeluguStop.com

దాంతో అందరి దృష్టి ప్రభాకర్‌పై నెలకొంది.అయితే ఆ వార్తలు పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.

ప్రభాకర్‌ మెగా మూవీ చేయడం లేదని తేలిపోయింది.మీడియాలో వస్తున్న వార్తలు గాలి వార్తలు మాత్రమే అంటూ మెగా సన్నిహితులు కొట్టి పారేశారు.

కొన్ని నెలల ముందు అల్లు శిరీష్‌కు ప్రభాకర్‌ ఒక స్టోరీ చెప్పిన విషయం నిజమే, కాని ఆ కథకు అల్లు శిరీష్‌ ఓకే చెప్పలేదని అంటున్నారు.అల్లు శిరీష్‌ ఆ సినిమా చేయక పోవడానికి కారణం అల్లు అర్జున్‌ అనే పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్రభాకర్‌తో సినిమా వద్దంటూ అల్లు శిరీష్‌కు అల్లు అర్జున్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే ఎవరితో పడితే వారితో సినిమాలు చేయవద్దని తమ్ముడికి అన్న బన్నీ గట్టిగా చెప్పాడట.

అందుకే శిరీష్‌ తన నిర్ణయంను వెనక్కు తీసుకున్నాడు.మొత్తంగా ప్రభాకర్‌ మెగా కలయిక నిజం కాదని తేలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube