టాలీవుడ్లో ఎప్పుడు ఏదో ఒక టైటిల్ వివాదం మీడియాలో వస్తూనే ఉంటుంది.నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ, సత్యదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు ‘లయన్’ అనే టైటిల్ పెట్టాలని నిర్మాత భావించగా, అప్పటికే ఆ టైటిల్ మరో నిర్మాత రిజిస్టర్ చేయించుకున్నాడు.
దాంతో ఆ టైటిల్ గురించి వారం పది రోజులు మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.తాజాగా మరో టైటిల్ వివాదం తెరపైకి వచ్చింది.
త్వరలో రవితేజ, సంపత్ నంది కాంబినేషన్లో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా తెరకెక్కబోతుంది.ప్రస్తుతం ‘టైగర్’ టైటిల్‌తో యువ హీరో సందీప్ కిషన్ ఒక సినిమా తెరకెక్కుతుంది.
ఈ రెండు టైటిల్స్ సేమ్ ఉండటంతో ప్రేక్షకులు గందరగోళంకు గురి అవుతారనే ఉద్దేశ్యంతో సంపత్ నంది ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.తాము ‘బెంగాల్ టైగర్’ టైటిల్‌ను చాలా రోజుల ముందే రిజిస్ట్రర్ చేయించామని, ఆ టైటిల్ మా ఆధీనంలో ఉన్నందున ‘టైగర్’ రిజిస్ట్రేషన్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ ఫిల్మ్ చాంబర్లో సంపత్ నంది తన వాదన వినిపిస్తున్నాడు.
దాంతో ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఏం చేయాలో పాలు పోవడం లేదు.ఈ వివాదం మీ ఇద్దరే తేల్చుకోవాలంటూ వారు చివరకు చేతులెత్తేశారు.
అయితే టైటిల్‌ను మార్చే ప్రసక్తే లే%
.