తెలంగాణా పై కమలం మౌనమా!!!

దాదాపుగా 120ఏళ్ల చరిత్ర ఉన్న కొంగ్రెస్ పార్టీ పాలనని అస్తవ్యస్తం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న కమలం పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని తమ గుప్పోట్లోకి లాక్కుంటూ ముందుకు పోతుంది.ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో సైతం తమదైన్ ముద్రవేసి ఆ రాష్ట్రాలను కమలనాదులు కైవసం చేసుకున్నారు.

 Bjp Not Interested In Telangana??-TeluguStop.com

అయితే అవకాశం ఉంది, కొంచెం ఓర్పు పెడితే తమ వశం అయిపోయే అవకాశం ఉన్న తెలంగాణా రాష్ట్ర విషయంలో బీజేపీ తీరు ఒకింత ఆలోచనకు గురిచేస్తుంది.రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నిజాం సోత్త్రాన్ని పదే పదే పఠిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకునే అవకాశం బీజేపీకి మాత్రమే ఉంది.

ఎందుకంటే.మిగిలిన పార్టీలకు ఉన్న ప్రతికూల పరిస్థితులు పోలిస్తే.

బీజేపీకే ఎక్కువ సానుకూలాంశాలు ఉన్నాయి.కానీ.

నిజాం గురించి ఆ విధంగా పొగుడుతున్నా పెద్దగా పట్టించుకున్న బీజేపీ నేతలు కనిపించరు.బీజేపీ సీనియర్‌ నేతలు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మొదలు.లక్ష్మణ్‌ వరకూ అందరూ మౌనంగా ఉండటంలో పరమార్థమేమిటో? కొంతలో కొంత కిషన్‌రెడ్డి మాత్రం ఈ విషయం మీద రియాక్ట్‌ అవుతున్నారు.బీజేపీ నేతల తీరుపై పార్టీ క్యాడర్‌లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.కేంద్రంలో అధికారంలో ఉండి.కేసీఆర్‌ లాంటి నేత మంచి అవకాశాన్ని కల్పించినా సరిగా ఉపయోగించుకోకుండా నెల్లు నములుతున్నారు బీజేపీ నేతలు.మరి ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube