ప్రతిపక్షాలకు.చంద్రబాబు అంటే ఇష్టం లేని వారికి…చంద్రబాబుకు క్రేజ్ లేదని విమర్శలు చేసే వారికి ఈ వార్త వింటే కచ్చితంగా అవ్వాక్కు అవ్వాల్సిందే.
విషయం ఏమిటంటే యూ ట్యూబ్ లో సినీ స్టార్స్ యొక్క వీడియోలు హల్‌చల్ చేయడం సహజమే.కానీ వారికి ధీటుగా చంద్రబాబు వీడియో ఒకటి యూ ట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది.
వివరాల్లోకి వెళితే డిసెంబరు 20న యువత అభిప్రాయాలను.అభిరుచులను తెలుసుకోవటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు.
గూగుల్‌హ్యాంగౌట్ ద్వారా కలుసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.ఇప్పటివరకూ ఈ వీడియోను.
యూ ట్యూబ్‌లో చూసిన వారు ఎంతమందో తెలుసా.? అక్షరాల 2కోట్ల 94లక్షల 62వేల 648 మంది చూశారు.ఈ కార్యక్రమాన్ని అప్పట్లో టీవీల్లో కూడా టెలికాస్ట్ చేశారు.అదికాకుండా ఇంత భారీ సంఖ్యలో యూట్యూబ్ ద్వారా వీక్షించారు.ఇక.ఏపీ సర్కారు ఖతా నుంచి కూడా 2.10లక్షల మంది చూడటం గమనార్హం.ఇక.హైటెక్ సీఎంగా పేరొందిన చంద్రబాబు ట్విట్టర్ అకౌంట్‌లో 4.37లక్షల మంది ఫాలోయర్లు ఉంటే.ఫేస్‌బుక్ ఖాతాలో 3.38లక్షల మంది అభిమానులు ఉన్నారు.ఏది ఏమైనా హైటెక్ బాబుగా పిలవబడే చంద్రబాబు ఇమేజ్ సోషియల్ మీడియాలో సూపెర్ గా ఉంది అంటున్నారు ఆయన అభిమానులు.







