చినబాబు సర్వే బాబుకు మంచిదేనా!!

రాజకీయాల్లో ఒపీనియన్ పోల్స్ అనేవి, పైగా వాటి నుంచే ఫలితాలు అనేవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి.సాధారణంగా ఎన్నికల సమయంలో ఊపిరి పోసుకునే ఈ సర్వేలు ఆయా పార్టీల బలాబలాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాయి.

 Lokesh Survey On Babu Rule Become Controversy-TeluguStop.com

అయితే పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ, పైగా వ్యాపారమే పరమావధిగా కొన్ని మెడీయా చానెళ్లు ప్రభుత్వానికి, పార్టీలకు సొంత సర్వేలు చేస్తూ ప్రజలను డైలమాలో పడేస్తున్నాయి.ఇక ఎన్నికల జగన్ చేయించిన సర్వేలు సైతం అలాంటి ఫలితాలనే ఇచ్చాయి.

అధికారం పక్కా అన్న మాటతో పాటు.జిల్లాల వారీగా ఎన్ని అసెంబ్లీసీట్లు గెలుచుకుంటామన్న విషయన్ని కూడా ఆయన చెప్పేవారు.

అదెలా అంటే.ఆయన సన్నిహితులు బోలెడన్ని రిపోర్టులు చూపించే వారు.

ఆ సందర్భంగా ఒక సంస్థకు సంబంధం లేకుండా మరో సంస్థతో సర్వే నిర్వహించామని.వాటన్నింటిని అధ్యయనం చేసి.

చివరకు ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించే విషయాన్ని లెక్క కట్టినట్లుగా చెప్పేవారు.వీటన్నింటితోనే జగన్‌ విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసేవారు.

అయితే చివరకు ఫలితం మాత్రం శూన్యం అని తెలిసింది.ఇప్పుడు అదే తప్పును చంద్రబాబు కోసం లోకేష్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా తన తండ్రి పాలనకు సంబంధించి లోకేశ్‌ చేపడుతున్న సర్వేపై విమర్శలు వినిపిస్తున్నాయి.ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 600 మందితో చేసిన శాంపిల్‌తో ఏపీ సర్కారుపై ప్రజలు ఏం అనుకుంటున్నారన్న విషయాన్ని తేల్చటం ప్రమాదకరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.

అందులోకి ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ విధానాన్ని చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.నెగిటివ్‌ కంటే పాజిటివ్‌ దృష్టికి ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుందని.

అదే జరిగితే.బాబు సర్కారు తప్పటడుగులు వేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మరి అధ్యక్షున్ణి స్యాటిస్ఫై చేసే విధంగా కన్నా ఉన్నవి ఉన్నట్లుగా నిజానిజాలు చెబితే సరిచేసుకుని మూడుకు పోయే అవకాశం ఉంటుంది.మరి దీనిపై చంద్రబాబు సర్కారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube