స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం గురించి హాట్ హాట్ టాపిక్ ఒకటి చిత్రపురిలో హల్‌చల్ చేస్తుంది.టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన ప్రకారం.
త్రివిక్రమ్ ఏ చిత్రం చేసినా ఎక్కువ సమయం తీసుకుని సంవత్సరం పాటు తెరకెక్కిస్తాడు.అంతేకాకుండా ముఖ్యంగా హీరోకి ఓపిక ఉండాలి కాని, కొన్ని సీన్స్ నచ్ఛకపోతే తిరిగి రి షెడ్యూల్ కూడ ప్లాన్ చేస్తాడు.
అయితే ప్రస్తుతం బన్నీతో సినిమాకూడా అలానే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్లే.ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి, గతంలో తను తెరకెక్కించిన చిత్రాల కంటే, ఈ చిత్రమే తక్కువ సమయంలో ఎక్కువ షూటింగ్ ని జరుపుకుంటున్న చిత్రంగా ఫిల్మ్ నగర్ లో హడావిడి మొదలయింది.
ఈ మూవీ షూటింగ్ పూర్తవటానికి కేవలం ఒకే ఒక షెడ్యూల్ ఉంది.ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ శబ్దాలయా స్టూడియోస్ లో ఇటివలే మొదలయ్యాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా ఉంటున్న ఈ మూవీకి, మంచి ట్యూన్స్ ని కంపోజ్ చేశాడని ల్యాబ్స్ వద్ద నుండి వినిపిస్తున్న సమాచారం.
అన్ని పనుల పూర్తి చేసుకొని, ఈ మూవీని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.మరి అదే నిజం అయితే ఫిబ్రవరిలో సైతం బాక్స్ ఆఫీస్ కు హడావిడి తప్పదు అని తెలుస్తుంది.







